Free Gas Cylinder: దేశంలో సాధారణ మధ్య తరగతి ప్రజల కోసం అనేక ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఓ స్కీం మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ అందిస్తుంది. అదే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY). 2016లో మొదలైన ఈ పథకం లక్ష్యం పొగ పొయ్యిల నుంచి గ్రామీణ ప్రజలకు విముక్తి కల్పించడం. ఈ పథకం, ఆరోగ్యాన్ని రక్షించడమే కాకుండా, ఆత్మగౌరవాన్ని కూడా పెంచుతుంది.
చాలామంది ప్రజల్లో
ఇప్పటివరకు 12 కోట్లకుపైగా మహిళలు ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందారు. ఎంతో మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందినా, చాలామంది ప్రజల్లో ఓ సందేహం ఉంది. ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరు మహిళలు ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందవచ్చా. ఈ క్రమంలో ఈ పథకం వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఉజ్వల యోజనలో ఏం లభిస్తుంది?
-వంటగదిలో ఉపయోగించే LPG కనెక్షన్ ఉచితం
-ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా
-కొన్ని సందర్భాల్లో గ్యాస్ స్టవ్ కూడా ఉచితంగా
-తొలి సిలిండర్ తర్వాత కొనుగోలు చేసే గ్యాస్‌కి సబ్సిడీ ప్రయోజనం
-2021లో కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన 2.0ని కూడా ప్రారంభించింది. దీనిలో మరిన్ని సౌకర్యాలు అందించబడ్డాయి. ఆన్‌లైన్ దరఖాస్తు సౌలభ్యం, వలస కూలీల కోసం రేషన్ కార్డు లేకుండానే కనెక్షన్ అందిస్తున్నారు.
Read Also: Bluetooth Earbuds: బ్లూటూత్ ఇయర్‌బడ్ లింక్ కాలేదా..ఈ …
ఒకే ఇంట్లో ఇద్దరు మహిళలు కనెక్షన్ పొందవచ్చా?
సాధారణంగా, ఒక కుటుంబానికి ఒక్క కనెక్షన్ మాత్రమే ఇవ్వబడుతుంది. అంటే, ఒక కుటుంబంలో ఒక మహిళకు ఇప్పటికే ఉజ్వల కనెక్షన్ ఉంటే, అదే ఇంట్లో ఉండే మరో మహిళకు కనెక్షన్ ఇవ్వరు. కానీ… కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఇద్దరికి కూడా ప్రయోజనం లభించవచ్చు. ఆ ప్రత్యేక పరిస్థితులు ఏమిటంటే, ఇద్దరు వేర్వేరు ఇళ్లలో నివసించాలి. వేర్వేరు రేషన్ కార్డులు ఉండాలి. వేర్వేరు కుటుంబ గుర్తింపు పత్రాలు, వేర్వేరు బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి. ఈ షరతులు వర్తిస్తే ఇద్దరు మహిళలూ ఉజ్వల యోజన కింద కనెక్షన్ పొందవచ్చు. అయితే, దీనికి సంబంధించి గ్యాస్ ఏజెన్సీ, చమురు కంపెనీలు ధృవీకరణ చేస్తాయి. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు వివరాలు, నివాసం వంటి అంశాలను జాగ్రత్తగా తనిఖీ చేసి, అర్హత నిర్ధారించాకే కనెక్షన్ మంజూరు చేస్తారు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అర్హతలు:
-దరఖాస్తు చేసే మహిళ బీపీఎల్ కుటుంబానికి చెందినవారి అయి ఉండాలి
-ఆమె పేరు SECC (Socio-Economic Caste Census) జాబితాలో ఉండాలి
-వయస్సు 18 ఏళ్లు పైబడినవారై ఉండాలి
-గతంలో ఏ గ్యాస్ కనెక్షన్ తీసుకోకుండా ఉండాలి
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు:
-ఉజ్వల యోజనకు దరఖాస్తు చేయాలంటే ఈ పత్రాలు సిద్ధంగా ఉంచాలి:
-ఆధార్ కార్డు
-రేషన్ కార్డు
-బీపీఎల్ కార్డు లేదా SECC జాబితాలో పేరు
-పాస్‌పోర్ట్ సైజు ఫోటో
-బ్యాంక్ ఖాతా వివరాలు (ఫోటోకాపీ)
-వయస్సు ధృవీకరణ పత్రం
-మొబైల్ నంబర్
-ఒకసారి కనెక్షన్ మంజూరైతే, ప్రతి నెల లేదా రెండు నెలలకు LPG సిలిండర్ పొందవచ్చు. మొదటి సిలిండర్ ఉచితంగా లభిస్తే, తరువాతి సిలిండర్లు సబ్సిడీతో అందుతాయి.
దరఖాస్తు ఎలా చేయాలి?
-అధికారిక వెబ్‌సైట్: www.pmuy.gov.in
-వెబ్‌సైట్‌లోకి వెళ్లాక, “Apply for Ujjwala 2.0” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
-మీకు సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని ఎంచుకోవాలి
-ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, మొబైల్ నంబర్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి
-పూర్తి చేసిన తర్వాత, మీకు రెఫరెన్స్ నంబర్ వస్తుంది
-తరువాత గ్యాస్ ఏజెన్సీ నుంచి మీకు కాల్ లేదా సందేశం వస్తుంది
-డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత, మీ కనెక్షన్ ప్రారంభమవుతుంది