E-Paper
Advertisement

Mohammed Shami: ఫైనల్స్ మ్యాచ్.. షమీ కుటుంబం ప్రత్యేక ప్రార్థనలు !

Mohammed Shami: ఫైనల్స్ మ్యాచ్.. షమీ కుటుంబం ప్రత్యేక ప్రార్థనలు !
Advertisement

Mohammed Shami: దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల ఫోకస్ మొత్తం ఇప్పుడు దుబాయ్ పైనే ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఫైనల్ పోరుకు మరికొన్ని గంటలలో తేరలేవనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ వర్సెస్ భారత్ జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ లో తప్పకుండా గెలిచి 25 ఏళ్ల పగకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది భారత జట్టు.

Also Read: Hardik Pandya-Natasa: ఆ నటుడితో టీమిండియా క్రికెటర్ భార్య రిలేషన్‌.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ ?

Advertisement

మరోవైపు న్యూజిలాండ్ మాత్రం మరోసారి టీమిండియాను మట్టి కరిపించాలని పట్టుదలతో ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే ఫీవర్ క్రీడాభిమానులను కలవరపెడుతోంది. నరాలు తెగే ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివరకు భారత్ – న్యూజిలాండ్ జట్లు రెండుసార్లు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ లో తలపడ్డాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2000, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021 ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమిని చవిచూసింది.

ఇక ప్రస్తుతం ఈ టైటిల్ పోరు కోసం ఇరుజట్లు హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్ లో మరోసారి స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో ఇరుజట్ల ఆటగాళ్లు స్పిన్నర్లను నెట్స్ లో ఎక్కువగా ఎదుర్కొన్నారు. ఈ మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 2:30 కి ప్రారంభం కానుంది. అయితే ఈ ఛాంపియన్ ట్రోఫీలో భారత జట్టు వరుసగా టాస్ ఓడిపోయింది. ఈ ఫైనల్ లో అయినా టాస్ గెలుస్తుందా..? లేదా అన్నది చూడాలి.

Advertisement

అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలవాల్సిన అవసరం లేదని అన్నాడు భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. న్యూజిలాండ్ కే ఏది ఎంచుకోవాలో వదిలేయాలని.. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్ మొదట బ్యాటింగ్ చేసినా, మొదట బౌలింగ్ చేసిన విజయం సాధించిందని.. అందుకే టాస్ గెలుపు పరిగణలోకి రాదని అన్నాడు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు గెలవాలని ఇండియాలోని క్రికెట్ అభిమానులు పూజలు చేస్తున్నారు. అయితే ఉత్తర ప్రదేశ్ లోని మురాదాబాద్ లో భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీ {Mohammed Shami} బంధువులు ఈ ఫైనల్ పోరులో భారత జట్టు విజయం సాధించాలని ప్రార్థనలు చేస్తున్నారు.

 

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసంతో ఉన్న మహమ్మద్ షమీ బంధువులు భారత జట్టు విజయం సాధించాలని ప్రార్థనలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ మ్యాచ్ లో బౌలింగ్ లో మహమ్మద్ షమీ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయాలని కోరుకుంటున్నారు. మరోవైపు భారత జట్టులో విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉండడం ప్లస్ పాయింట్. ఒంటి చేత్తో విజయాలు సాధించగల సత్తా కోహ్లీ సొంతం. అలాగే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 45 పరుగులు చేస్తే క్రిస్ గేల్ రికార్డుని బద్దలు కొడతాడు.

Tags

Related News

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

Big Stories

Advertisement
×