BigTV English

World’s Richest Beggar: ప్రపంచంలో ఖరీదైన బిచ్చగాడు.. ఎవరు, ఎక్కడుంటాడో తెలుసా?

World’s Richest Beggar: ప్రపంచంలో ఖరీదైన బిచ్చగాడు.. ఎవరు, ఎక్కడుంటాడో తెలుసా?

World’s Richest Beggar: ప్రపంచవ్యాప్తంగా కొన్ని రంగాల్లో భారత్‌దే పైచేయి. భారతీయులు ఎక్కడికి వెళ్లినా తమకు తిరుగులేదని నిరూపించారు.. కంటిన్యూ చేస్తున్నారు కూడా. కొన్ని రంగాల్లో పైచేయి సాధించిన సందర్భాలు లేకపోలేదు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన బిచ్చగాడిగా పేరు తెచ్చుకున్నాడు భారత్ జైన్ అనే వ్యక్తి. ఇంతకీ ఇక్కడ? ఆదాయం ఎంతో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్తాల్సిందే.


దక్షిణాదిలో ఆ మధ్య ‘బిచ్చగాడు’ సినిమా వచ్చింది. తల్లి కోసం కోట్లాది రూపాయలను ఆస్తులను సైతం వదిలేసి చివరకు బిచ్చగాడిగా మారాడు. తమిళనాడులోని ఓ ప్రాంతంలో జరిగిన యథార్థ వాస్తవాన్ని వెండితెర పైకి ఎక్కించారు. సీన్ కట్ చేస్తే.. పైన కనిపిస్తున్న వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు ఆయన్ని బిచ్చగాడిగా మార్చేసింది. అదే ఆయన్ని ప్రపంచంలో ఖరీదైన బిచ్చగాడిగా మార్చేసింది.

కనిపిస్తున్న వ్యక్తి పేరు భారత్ జైన్. ముంబైలోని బిజీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఆజాద్ మైదాన్‌తో సహా నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో భిక్షాటన చేస్తుంటాడు. 54 ఏళ్ల భారత్‌ జైన్‌ తన పురాతన వృత్తిని వ్యాపారంగా మార్చేసుకున్నాడు. పేరుకే బిచ్చగాడు అయినా ఆర్థిక విజయాన్ని ఎలా సాధించాడో తెలియాలంటే ఆయన జీవితమే ఒక ఉదాహరణ.


తన 14 ఏట ఈ వృత్తికి అలవాడుపడ్డాడు భారత్ జైన్. ఇందుకు కారణాలు అనేకం. నాలుగు దశాబ్దాలుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాడు కూడా. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాడు. అతడి కుటుంబం తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంది. చదువును మధ్యలో ఆపేశాడు. ఓ వైపు ఫ్యామిలీ సమస్యలను అధిగమించడానికి నానాకష్టాలు పడ్డాడు. ఈ వృత్తిని ఛాలెంగ్‌గా తీసుకున్నాడు.. సక్సెస్ అయ్యాడు.

ALSO READ: కింగ్ ఫిషర్ టవర్‌లో ఫ్లాట్ 50 కోట్లు.. కొన్నదెవరో తెలుసా?

54 ఏళ్ల భారత్ జైన్.. రోజువారీ సంపాదన ఎంతో తెలుసా? అక్షరాలా 2000 నుంచి 2,500 రూపాయలు. రోజుకు 10 నుంచి 12 గంటలు మాత్రమే కష్టపడతాడు. నెలకు వచ్చేసరికి ఆయన ఆదాయం అక్షరాలా 60 వేల నుంచి 80 వేలు మధ్యలో ఉంటుంది. నమ్మడానికి విచిత్రంగా ఉంది కదూ. తన ఆలోచనలను జైన్ పెట్టుబడిగా మార్చుకున్నాడు.

భారత్ జైన్ భిక్షాటన నుండి కోటీశ్వరుడిగా ఎదగడానికి దాదాపు 40 ఏళ్లు పట్టింది. వచ్చిన ఆదాయానికి తెలివి తేటలు జోడించాడు. అతడికి ముంబైలో కోటిన్నర విలువ చేసే రెండు ఫ్లాట్లు ఉన్నాయి. భార్య, ఇద్దరు కుమారులు, తండ్రి, సోదరుడితో కలిసే ఉంటున్నాడు. థానేలో రెండు షాపులు కూడా ఉన్నాయి. వాటి ద్వారా వచ్చే ఆదాయం నెలకు అక్షరాలా 30,000 వేల రూపాయలు.

ఇద్దరు కుమారులను ఫేమస్ స్కూల్‌లో జాయిన్ చేయించాడు. పిల్లలు పెద్దవారయ్యారు..  ఫ్యామిలీ బిజినెస్ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వీరు ఓ స్టేషనరీ స్టోరీ నడుస్తోంది. ఈ క్రమంలో నేషనల్ మీడియాతో మాట్లాడిన జైన్.. తనకు అత్యాశ లేదన్నాడు. తనకు వస్తున్న డబ్బులో కొంత దేవాలయాలు, స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తున్నాడు కూడా.

అలాగని తన వృత్తిని వదలుకోలేదు.. ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. బిచ్చగాళ్లకు భారత్ జైన్ ఐకాన్ లాంటివాడన్నమాట.  ప్రస్తుతం ఈయన ప్రపంచంలో అత్యంత ఖరీదైన బిచ్చగాడుగా పేరు తెచ్చుకున్నట్లు ఓ ఇంగ్లీష్ పత్రిక రాసుకొచ్చింది.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×