BigTV English

IRCTC Down: ఐఆర్‌సిటిసి ఆన్‌లైన్ బుకింగ్ డౌన్.. రైల్వే మంత్రిపై కేసు పెడతా!

IRCTC Down: ఐఆర్‌సిటిసి ఆన్‌లైన్ బుకింగ్ డౌన్.. రైల్వే మంత్రిపై కేసు పెడతా!

IRCTC Down| రైలు ప్రయాణికులు ఈ రోజు ట్రైన్ టికెట్లు ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవడానికి తెగ ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం డిసెంబర్ 9, 2024న ఉదయం నుంచి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్, వెబ్ సైట్ సర్వర్తు దేశవ్యాప్తంగా డౌన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో లక్షలాది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోలేక పోతున్నారు.


వెబ్‌సైట్ల సర్వర్లు డౌన్ ఉంటే వాటి గురించి తెలిపే డౌన్‌డిటెక్టర్ డాట్ కామ్ (Downdetector.com) ప్లాట్ ఫామ్ ప్రకారం.. ఐఆర్‌సిటిసి వెబ్ సైట్, యాప్ రెండింట్లో కూడా యూజర్లు లాగిన్ సమస్యల ఎదుర్కొంటున్నారు. ఒకవేళ లాగిన అయినా టికెట్లు బుక్ కావడం లేదు. డౌన్‌డిటెక్టర్ డాట్ కామ్ తెలిపిన సమాచారం ప్రకారం.. దాదాపు 49 శాతం యూజర్లు ఐఆర్‌సిటిసి వెబ్ సైట్ లో లాగిన్ కాలేకపోతున్నారు. మరోవైపు 40 శాతం యూజర్లు యాప్ పనిచేయడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. కొంతమంది అయితే లాగిన్ అవుతున్నా.. టికెట్లు బుక్ కావడం లేదని వాపోతున్నారు.

ఐఆర్‌సిటిసి ఆన్‌లైన్ సర్వర్లు ఉదయం 9.30 నుంచి పనిచేయడం లేదని తెలిసింది. ట్రైన్ షెడ్యూల్, టికెట్ ధర గురించి, టికెట్ బుకింగ్ గురించి సెర్చ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే లాగిన్ సమస్యలు, ఎర్రర్ మెసేజ్ లు వస్తున్నాయని చాలా మంది యూజర్లు సోషల్ మీడియాలో అసహనంగా పోస్ట్‌లు పెడుతున్నారు. దీని వెనుక కారణాలేంటో ఇప్పటివరకు తెలియలేదు. కానీ ఐఆర్‌సిటిసి వెబ్ సైట్లో మాత్రం మెయింటెనెన్స్ ప్లాబ్లమ్ మరో గంటలో సర్వీసు అందుబాటులోకి వస్తుందని మెసేజ్ చూపిస్తోంది.


Also Read: రూ. 5 వేల కోట్లు, 13 వేల రైళ్లు.. మహా కుంభమేళాలకు రైల్వే కనీవినీ ఎరుగని ఏర్పాట్లు

ఒక యూజర్ అయితే ఆగ్రహంగా రైల్వే మంత్రి అశ్విన వైష్టవ్, రైల్వే శాఖకు ట్యాగ్ చేస్తూ.. “ఏదైనా ఫ్రాడ్ జరుగుతోందా? నేను గతవారం రోజుల నుంచి ప్రతిరోజు ఉదయం 10 గంటలకు టికెట్ బుక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. కానీ బుకింట్ పేజీ వరకు వెళ్లలేకపోతున్నా. వెబ్ సైట్ డౌన్, యాప్ డౌన్.. అసలు ఏం జరుగుతోంది?” అని నిలదీస్తూ పోస్ట్ చేశాడు.

మరో యూజర్ అయితే చాలా చిరాకతో ఎక్స్ లో ఒక ట్వీట్ చేశాడు. ” ఐఆర్‌సిటిసి చాలా చెత్త సర్వేసు ఇస్తోంది. ఇది ఎప్పడు మెరుగుపడుతుందని ఆశించాలి? మన దేశంలో ఆన్‌లైన్ ట్రాఫిక్‌ని హ్యాండిల్ చేసే టెక్నాలజీ రూపొందించడానికి అసలు సమర్థులే లేరా? అభివృద్ధి గురించి మాట్లాడుతుంటారు. అసలు పునాదులే బలహీనంగా ఉన్నాయని ఎప్పుడు గ్రహిస్తారు. సర్వర్ ఎప్పుడూ డౌన్ గానే ఉంటుందా?” అని ట్వీట్ లో రాశాడు.

ఇంకొక యూజర్ అయితే రైల్వే శాఖ, రైల్వే మంత్రి అశ్విన వైష్టవ్‌కు ట్యాగ్ చేస్తూ కేసు పెడతానని బెదిరిస్తూ పోస్ట్ చేశాడు. “మన జాతీయ ట్రైన్ బుకింగ్ సిస్టమ్ ఐఆర్‌సిటిసి డౌన్ అని గంట సేపటి నుంచి చూపిస్తూనే ఉంది. ఎవరూ దాని గురించి సీరియస్ గా మాట్లాడడం కూడా లేదు. నాకు నా కెరీర్ లోనే అత్యంత ముఖ్యమైన ట్రైన్ మిస్ అయితే మీపైన కేసు పెడతాను” అని రాశాడు.

Related News

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Train Travel: రైలు ప్రయాణీకులకు ఇన్ని రైట్స్ ఉంటాయా? అస్సలూ ఊహించి ఉండరు!

Big Stories

×