Aadhaar Linked: ప్రస్తుత కాలంలో స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్‌మెంట్ గురించి దాదాపు అనేక మందికి అవగాహన ఉందని చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయాలంటే డీమ్యాట్ ఖాతా (Demat Account) తప్పనిసరి. ఈ క్రమంలో మీ డీమ్యాట్ ఖాతా ఆధార్‌తో లింక్ చేయడం ఇప్పుడు తప్పనిసరిగా మారింది. మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI (Securities and Exchange Board of India) ఇటీవల అందరికీ తమ డీమ్యాట్ ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయాలని నిబంధన విధించింది. మీరు ఇప్పటికే డీమ్యాట్ ఖాతా తీసుకున్న వారు అయినా లేదా కొత్తగా డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేసినా కూడా ఈ రూల్ పాటించాలని అంటున్నారు. అయితే దీనిని ఎలా లింక్ చేయాలనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
డీమ్యాట్ ఖాతా అంటే ఏంటి?
డీమ్యాట్ (Demat) ఖాతా అనేది డిజిటల్ అకౌంట్. ఇది మీ స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్‌లు, ఇతర ఆర్థిక ఉత్పత్తులను డిజిటల్ రూపంలో నిల్వ చేసుకునేందుకు సహాయపడుతుంది. మీకు బ్యాంక్ అకౌంట్ అవసరమైనట్లే, స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలు చేయడానికి డీమ్యాట్ ఖాతా అవసరం.
ప్రస్తుతం భారతదేశంలో ప్రధానంగా రెండు డిపాజిటరీలు ఈ సేవలను అందిస్తున్నాయి:
-NSDL (National Securities Depository Limited)
-CDSL (Central Depository Services Limited)
SEBI కొత్త మార్గదర్శకాలు
-SEBI ఇటీవల అన్ని డీమ్యాట్ ఖాతాదారులకు ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది.
-లింక్ చేయని ఖాతాలను నిలిపివేస్తామని తెలిపింది
-లింకింగ్ పూర్తయ్యే వరకు లావాదేవీలను అనుమతించరు
-భవిష్యత్‌లో KYC ప్రక్రియను సులభతరం చేయడంలో ఇది సహాయపడుతుంది.
Read Also: Business Idea: తక్కువ పనితో నెలకు రూ. 2 లక్షలకుపైగా …
డీమ్యాట్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ప్రయోజనాలు
-అకౌంట్‌లో మోసపూరిత లావాదేవీలు జరగకుండా నివారించవచ్చు
-KYC లాంటివి పూర్తి చేయడం సులభమవుతుంది
-మీ లావాదేవీలను ఒకే చోట సులభంగా పర్యవేక్షించవచ్చు
-అన్ని లావాదేవీలను సులభంగా నిర్వహించవచ్చు స్టాక్‌లు, బాండ్‌లు, మ్యూచువల్ ఫండ్లు లాంటి వాటిని సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు.
బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుసంధానం చేయడం ద్వారా బ్యాంక్ ఖాతా, డీమ్యాట్ ఖాతా మధ్య లావాదేవీలు చేసుకోవడం ఈజీ అవుతుంది.
డీమ్యాట్ ఖాతాను ఆధార్‌తో లింక్ కోసం అవసరమైన పత్రాలు
-ఆధార్ నంబర్
-పాన్ కార్డ్
-డీమ్యాట్ ఖాతా నంబర్ (DP ID, Client ID)
-రిజిస్టర్డ్ మొబైల్ నంబర్
-రిజిస్టర్డ్ ఇమెయిల్ ID
డీమ్యాట్ ఖాతాను ఆధార్‌తో ఆన్‌లైన్‌లో లింక్ చేయడం ఎలా?
మీరు కేవలం 10 నిమిషాల్లో మీ డీమ్యాట్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చు. దాని కోసం క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:
-మీరు డీమ్యాట్ అకౌంట్ తీసుకున్న డిపాజిటరీ వెబ్‌సైట్ (NSDL లేదా CDSL) సందర్శించండి:
-NSDL – www.nsdl.co.in
-CDSL – www.cdslindia.com
-తర్వాత హోమ్ పేజ్‌లోని “Link Aadhaar to Demat” లేదా “Aadhaar Linking” లింక్‌ను క్లిక్ చేయండి.
-క్రింది వివరాలను నమోదు చేయండి:
-DP పేరు, DP ID, క్లయింట్ ID, పాన్ నంబర్
-వివరాలను నమోదు చేసిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇమెయిల్ ID కు OTP వస్తుంది.
-OTP నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
-ఆధార్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయండి.
-మీ ఆధార్‌కు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేసి సబ్మిట్ చేయండి.
-ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిన తర్వాత, మీకు SMS, ఇమెయిల్ ద్వారా ధృవీకరణ నోటిఫికేషన్ వస్తుంది.
డీమ్యాట్ ఖాతా లింకింగ్ తర్వాత చేపట్టవలసిన చర్యలు
లావాదేవీలను ధృవీకరించండి – లింకింగ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, స్టాక్ ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఏదైనా సమస్య ఎదురైతే, మీరు డిపాజిటరీ కస్టమర్ కేర్‌ను సంప్రదించవచ్చు.