Green Card Holders: అమెరికాలో ఉన్న గ్రీన్‌కార్డు దారులకు కొత్త టెన్షన్ మొదలైందా? గ్రీన్‌కార్డు దారుల విషయంలో అక్కడి చట్టాలను ట్రంప్ సర్కార్ కఠినంగా అమలు చేస్తోందా? ఆదేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాటలు దేనికి సంకేతం? చట్టంలోని లొసుగులు ఉపయోగించుకుని గ్రీన్ కార్డు దారులను తగ్గించేందుకు స్కెచ్ వేస్తోంది. ఈ నేపథ్యంలో చట్టాలను పదును పెట్టిందా? ఈ విషయంలో అక్కడ నివాసం ఉంటున్న భారతీయులు ఎందుకు భయపడుతున్నారు? ఇలాంటి ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ట్రంప్ సర్కార్ వలసదారులపై కఠినంగా చట్టాలను అమలు చేస్తోంది. ఇటీవల అక్కడ జరుగుతున్న ఘటనలు అందుకు కారణం. ఎన్నారైలు స్వదేశానికి వచ్చి ఎక్కువ రోజులు ఉంటే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. దీనివల్ల వారి విచారణకు గురవుతున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. ఇటీవల గ్రీన్ కార్డు పొందిన జర్మన్ వ్యక్తి, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులో గ్రీన్ కార్డ్ దారులను బట్టలు విప్పి తనిఖీ చేయడం, తీవ్రమైన విచారణ వంటి సమస్యలు క్రమంగా పెరుగుతున్నాయి.
అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ సైతం ఇదే విషయాన్ని నొక్కి వక్కానించారు. గ్రీన్ కార్డ్ హోల్డర్లు అమెరికాలో శాశ్వతంగా ఉండే హక్కులేదని తేల్చేశారాయన. ఈ నేపథ్యంలో గ్రీన్ కార్డ్ హోల్డర్లపై ఎక్కువ పరిశీలన జరుగుతోంది. వారెవరు అనేదానిపై లోతుగా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భారతీయ గ్రీన్ కార్డ్ వినియోగదారులను ఎందుకు ఆందోళనకు గురి చేస్తుంది? ఈ నేపథ్యంలో గందరగోళానికి కారణమైన ఐదు అంశాలను గుర్తు చేద్దాం.
1. అమెరికా ఇటీవల ఓ గ్రీన్‌కార్డు దారుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని న్యూడ్‌గా నిలబెట్టించినట్టు మీడియా మీడియా రిపోర్టులు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం తనిఖీలు, హింసాత్మక విచారణలు ప్రారంభించడంతో అక్కడి గ్రీన్ కార్డు వినియోగదారుల్లో భయం మొదలైంది. కొద్దిరోజుల కిందట జర్మన్ జాతీయుడు అమెరికా గ్రీన్‌కార్డు హోల్డర్ ఫాబియన్ ష్మిత్ మార్చి 7న అమెరికాకు వచ్చాడు. మసాచుసెట్స్‌లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకుని దారుణమైన పద్దతిలో విచారించారని మీడియా చెబుతోంది.
ALSO READ: స్పేస్ స్టేషన్ నుంచి బయలుదేరిన సునీత టీమ్
చివరకు అతడి గ్రీన్ కార్డును క్యాన్సిల్ చేశారు. ఎందుకు అలా చేయవలసి వచ్చిందో వివరాలు వెల్లడించలేదు అమెరికా కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ సిబ్బంది. మీడియా రిపోర్టులను సీబీపీ అసిస్టెంట్ కమిషనర్ తోసిపుచ్చారు. ఓ వ్యక్తి మాదక ద్రవ్యాల సంబంధిత ఆరోపణలతో దొరికి దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు అధికారులు సరైన చర్య తీసుకుంటారని వివరించారు. వీసా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ప్రయాణికులు నిర్బంధం, తొలగింపు ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పారు.
2. పరిశీలనలో గ్రీన్ కార్డు సీనియర్ సిటిజన్స్. అమెరికాలోని వివిధ ఎయిర్‌పోర్టుల్లో భారతీయ సీనియర్ సిటిజన్స్ పరిశీలన, తనిఖీ పెరిగినట్లు నివేదికలు వస్తున్నాయి.అమెరికా బయట ఎక్కువ కాలం గడిపే వ్యక్తులను, భారతదేశాన్ని తరచుగా సందర్శించే వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. విచారణ సమయంలో ఫారం- I-407పై సంతకం చేయాలని శాశ్వత నివాసాన్ని అప్పగించమని బలవంతం చేస్తున్నట్లు ఫ్లోరిడాకు చెందిన ఇమ్మిగ్రేషన్ ఓ న్యాయవాది మాట. గ్రీన్ కార్డు కలిగిన భారతీయ సీనియర్ సిటిజన్స్ శీతాకాలం సమయంలో భారత్ లో గడపటానికి ఇష్టపడతారు, అక్కడ చలికాలం కఠినంగా ఉండదని అంటున్నారు.
ఇప్పుడు ఈ విషయాన్ని పరిశీలన చేస్తున్నట్లు మీడియా మాట. ఒక వ్యక్తి స్వచ్ఛందంగా ఫారమ్ I-407పై సంతకం చేయకపోతే అతడి గ్రీన్‌కార్డ్ రద్దు చేయలేరని మరొక న్యాయవాది చెబుతున్నారు. అమెరికా వెలుపల 365 రోజులకు పైగా గడిపినట్లయితే వారు శాశ్వత నివాసాన్ని వదిలి పెట్టవచ్చన్న ఆరోపణలు లేకపోలేదు. దీనిపై న్యాయస్థానంలో సవాలు చేసే హక్కు వారికి ఉందన్నారు. ఒకవేళ ఎయిర్‌పోర్టులో తనిఖీల్లో లొంగిపోతే ఆ హక్కును కోల్పోతారని చెబుతున్నారు.
3. ట్రంప్ ప్రభుత్వం అమెరికన్ ఫస్ట్ అని స్పష్టంగా చెప్పింది. తొలుత అమెరికన్లను ముందు నుంచి చెబుతూ వస్తోంది. గ్రీన్‌కార్డు హోల్డర్లపై కఠిన చర్యలు తీసుకోవడం అక్కడి విధానాలలో ఇదీ ఓ భాగం. శాశ్వత నివాసితులపై పరిశీలనను నొక్కి చెబుతోంది. గతసారి ట్రంప్ చివరికాలంలో నివాసం పొందేందుకు కఠినమైన ప్రమాణాలను పెట్టమని ప్రతిపాదించారు. అందుకు తగినట్టుగానే ఈసారి సరిహద్దు అధికారులకు చట్టపరమైన అధికారాలు ఇచ్చారు. అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈసారి గ్రీన్ కార్డ్ హోల్డర్లు ప్రమాదం అంచున ఉన్నారని చెప్పవచ్చు.
గ్రీన్ కార్డ్ రద్దు అనేది ఒక చట్టపరమైన ప్రక్రియ.ఒక వ్యక్తి ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించాడని అమెరికా ప్రభుత్వం నిర్ధారించినప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతుందన్నారు. దీని గురించి ప్రభుత్వం దృష్టికి రావచ్చని అంటున్నారు. ఇమ్మిగ్రేషన్ తనిఖీ ద్వారా చట్ట అమలు దర్యాప్తు ద్వారా లేదా విజిల్ బ్లోయర్ ద్వారా కావచ్చు.
4. గ్రీన్‌కార్డు పోతే ఎవరు భయపడాలి? అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం గ్రీన్ కార్డ్ హోల్డర్లు అనేక కారణాల వల్ల వారి చట్టబద్ధమైన శాశ్వత నివాస హక్కు కోల్పోవచ్చు. గ్రీన్ కార్డ్ రద్దు అనేది అమెరికా ప్రభుత్వం వలస చట్టాలను ఉల్లంఘించి నిర్ధారించినప్పుడు జరిగే చట్టపరమైన ప్రక్రియ. ఇది సాధారణ తనిఖీలు, చట్ట అమలు దర్యాప్తు విజిల్ బ్లోయర్‌ల ద్వారా జరగవచ్చు. గ్రీన్‌కార్డు దారుడు ఆరు నెలలకు పైగా విదేశాలలో ఉన్నప్పుడు తిరిగి ప్రవేశించినప్పుడు ప్రశ్నిస్తారని చెబుతున్నారు. అయితే రీ-ఎంట్రీ పర్మిట్ లేకుండా ఏడాది కంటే ఎక్కువ కాలం బయట ఉన్నవారు అక్కడి సెక్షన్ల కింద INA 101(a)(13)(C) శాశ్వత హోదా కోల్పోయే అవకాశం ఉంది. రీ-ఎంట్రీ పర్మిట్ ఉన్నప్పటికీ, అమెరికా బయట ఎక్కువకాలం ఉండటం వల్ల ఇబ్బంది తప్పదు. స్వదేశంలో ఎక్కువ కాలం గడిపే సీనియర్ సిటిజన్స్ ని లక్ష్యంగా చేసుకుని విమానాశ్రయాలలో గ్రీన్ కార్డ్ అప్పగించాలని ఒత్తిడి చేస్తున్నారట.
జాతీయ భద్రతా సమస్య మరొక ప్రధాన కారణం. INA 237(a)(4)(B) కింద ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చినా గ్రీన్ కార్డుదారులకు ఇబ్బందులు తప్పవు. నేర చరిత్రలు, మోసపూరిత వలస కార్యకలాపాలు కూడా చాలామంది ప్రమాదంలో పడేస్తాయి. INA 237(a)(2) ప్రకారం మాదకద్రవ్యాలు, తీవ్రమైన నేరాలు, గృహ హింసకు పాల్పడినా శాశ్వత హోదా తొలగించవచ్చని అక్కడి చట్టం చెబుతోంది. ఇలాంటి సమయాల్లో అక్కడి చట్టంలో చిన్న ఉల్లంఘనల వల్ల అమెరికాలో ఉండే హోదాను కోల్పోతారు గ్రీన్ కార్డ్ హోల్డర్లు.
5. భారతీయులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? గ్రీన్‌కార్డు రద్దు గురించి భారతీయులు ఆందోళన చెందడానికి కారణాలు లేకపోలేదు. గ్రీన్‌కార్డు ప్రయోజనం పొందినవారిలో సెకండ్ జాబితాలో భారతీయులు ఉన్నారు. ఉద్యోగాల కోసం వచ్చినవారు దాదాపు ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది భారతీయులు అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. గ్రీన్ కార్డుదారులపై తీవ్రమైన పర్యవేక్షణ కొనసాగితే వారు డిపోర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చట్ట పరమైన స్థిర నివాసం ఉండకపోవచ్చు, అనేక మందిలో ఈ భయం వెంటాడుతోంది. పై కారణాల నేపథ్యంలో గ్రీన్ కార్డులను ఎప్పుడైనా రద్దు చేయవచ్చని అంటున్నారు.ఇది ఎన్నారైలకు ముఖ్యమైన విషయమని ఓ వ్యక్తి ఎక్స్ లో ప్రస్తావించాడు.
ఆ దేశ పౌరులు- స్థానిక పౌరుల మధ్య వివక్ష చూపడం ముమ్మాటికీ తప్పు. దీనివల్ల గ్రీన్ కార్డ్‌ను ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. ప్రపంచంలోని చాలా దేశాలు ఇలాగే చేస్తాయి కూడా. ఇందుకు కొన్ని ఉదాహరణలు చెబుతోంది. కెనడాలో ఉన్న ఖలిస్తానీయులు ఆ దేశం ఇచ్చిన OCI గుర్తింపును భారతదేశం రద్దు చేసిందని మరికొందరు గుర్తు చేస్తున్నారు. గ్రీన్ కార్డ్ హోల్డర్ సందర్శకుడు కాదని, యూఎస్‌లో శాశ్వతంగా నివసించడానికి, పని చేయడానికి చట్టబద్ధమైన శాశ్వత వాసి మాత్రమే. విజిటర్స్‌కు నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాపై తాత్కాలిక బస అనుమతించబడుతుంది. అమెరికాలో చట్టబద్ధంగా ఏళ్ల తరబడి నివసిస్తున్నప్పటికీ, ఇమ్మిగ్రేషన్‌ను కఠినతరం చేయడం వల్ల తమకు ఇబ్బందులు తప్పవని చాలామంది భారతీయులు భయపడుతున్నారు.