BigTV English
Advertisement

Zhidou Rainbow Mini Ev: రూ.3. 6 లక్షలకే బుల్లి ఎలక్ట్రిక్ కారు!.. ఎక్కడో తెలుసా?

Zhidou Rainbow Mini Ev: రూ.3. 6 లక్షలకే బుల్లి ఎలక్ట్రిక్ కారు!.. ఎక్కడో తెలుసా?

Zhidou Rainbow Mini Ev Launched: మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్లకు సూపర్ డూపర్ డిమాండ్ ఉంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా రోజు రోజుకీ కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ కార్ ప్రియులను అట్రాక్ట్ చేసేందుకు ప్రముఖ కంపెనీలు సైతం డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించి ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరొక కొత్త ఎలక్ట్రిక్ కారు తన ధర, అద్భుతమైన డిజైన్, లుక్‌తో వాహన ప్రియుల్ని ఆకట్టుకుంటుంది.


ప్రముఖ చైనీస్ కార్ల తయారీ కంపెనీ జిడౌ చైనా మార్కెట్‌లో ‘రెయిన్‌బో మినీ’ పేరుతో ఓ సరికొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. ఆ ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన లుక్‌తో అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఆ కారు అచ్చం భారత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఎంజీ కామెట్ ఈవీ లుక్‌ని కలిగి ఉంది.

కాగా ఈ జిడౌ రెయిన్‌బో మినీ ఎలక్ట్రిక్ కారు రూ.3.6 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుందని మార్కెట్ నిఫుణుల సమాచారం. జిడౌ కంపెనీ కార్లకు చైనీస్ మార్కెట్‌లో మంచి పాపులారిటీ ఉంది. ఈ కంపెనీ నుంచి కార్ లాంచ్ అవుతుందంటే వాహన ప్రియులు ఎగబడి కొనేస్తుంటారు. 2014లో ఈ కంపెనీ డి1 పేరుతో ఓ కారును లాంచ్ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత డి2, డి3 పేర్లతో కూడా కార్లను లాంచ్ చేసింది.


Also Read: ఎలక్ట్రిక్ కారుపై బంపరాఫర్.. ఏకంగా లక్ష రూపాయల డిస్కౌంట్.. త్వరపడండి!

ఇప్పుడు జిడౌ కంపెనీ మరొక కొత్త కారును రెయిన్‌బో మినీను చైనీస్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇది మూడు డోర్లు కలిగి ఉంది. అంతేకాకుండా ఇందులో నాలుగు సీట్లు ఉంటాయి. ఈ కారు ఎల్లో, పింక్, బ్రౌన్, గ్రీన్, పర్పుల్ వంటి కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇక దీని డిజైన్ విషయానికొస్తే.. ఈ కారు చూడటానికి చాలా చిన్నగా.. ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బిగ్ డిప్పర్ హెడ్ లైట్‌లు, కార్బన్ ఫైబర్ మిర్రర్‌లతో వచ్చింది.

కారు లోపల కూడా మొత్తం పింక్ కలర్‌తో అట్రాక్షన్‌గా అమర్చారు. డబుల్ స్పోక్ స్టీరింగ్ వీల్ అందించారు. అంతేకాకుండా 5 ఇంచుల ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కూడా అమర్చారు. అలాగే మొబైల్ ఫోన్ రియోట్ వెహికల్ కంట్రోల్, రిమోట్ కార్ సెర్చ్, రిమోట్ వెహికల్ అన్‌లాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇది లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్ మొత్తం మూడు సామర్థ్యాలను కలిగి ఉంటాయి. అందులో 9.98 కిలోవాట్ 125 కి.మీ రేంజ్ అందిస్తుంది. అలాగే 17.18 కిలో వాట్ 205 కి.మీ రేంజ్ అందిస్తుంది. 17.3 కిలో వాట్ 201 కి.మీ రేంజ్‌ను అందిస్తాయి.

Tags

Related News

DMart: ఏంటీ.. డిమార్టులో ఇలా మోసం చేస్తున్నారా? ఈ వీడియోలు చూస్తే గుండె గుబేల్!

Gold Rate Increased: వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?

Digital Gold: డిజిటల్ గోల్డ్‌ తో జాగ్రత్త.. సెబీ సీరియస్ వార్నింగ్!

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Big Stories

×