BigTV English

Australian MP Molested| ఆస్ట్రేలియా మహిళా ఎంపీపై లైంగిక దాడి

Australian MP Molested| ఆస్ట్రేలియా మహిళా ఎంపీపై లైంగిక దాడి

Australian MP Molested| ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర ఎంపీ సోషల్ మీడియా ద్వారా తనపై అత్యాచారం జరిగిందని తెలిపారు. క్వీన్స్ ల్యాండ్ మహిళా ఎంపీ బ్రిట్టనీ లౌగా (37) తన ఇన్స్ టాగ్రామ్ అకౌంట్ లో తనపై జరిగిన అత్యాచారం గురించి పోస్టు పెట్టారు. ఈ పోస్టు చదివిన వారంతా ఆశ్చర్యపోయారు.


ఏప్రిల్ 28న ఆమె తన మిత్రులతో కలిసి ఒక నైట్ పార్టీకి వెళ్లినప్పుడు ఎవరో తన డ్రింక్ లో మత్తు మందు కలిపారని.. ఆ తరువాత తను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆమెపై అత్యాచారం చేశారని ఆమె తెలిపారు. ఈ ఘటన తరువాత ఆమె ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయిస్తే.. తన రక్తంలో మత్తు పదార్థాలు ఉన్నట్లు తెలిసిందని.. తాను ఎప్పుడూ మత్తు, లేదా డ్రగ్స్ తీసుకోనని ఆమె తన ఇన్స్ టాగ్రామ్ పోస్ట్ చేశారు. ఆస్పత్రిలో టెస్టులు గురించి తెలిశాక తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని వివరించారు.

తనతోపాటు నైట్ పార్టీకి వచ్చిన ఇతర మహిళల డ్రింక్స్ లో కూడా ఇలాగే మత్తు పదార్థాలు కలిపినట్లు తెలిసిందని బ్రిట్టనీ వెల్లడించారు. “ఇలాంటి ఘటన ఎవరికైనా జరగవచ్చు.. ఇప్పటికే ఇలా మనలో చాలామందికి జరిగి ఉండవచ్చు. కానీ దోషులకు శిక్ష పడాలి.. పార్టీలకు వెళితే.. మన డ్రింక్స్ లో ఏదో కలిపి ఇస్తారనే భయంతో స్నేహితులతో పార్టీలు చేసుకోకుండా ఉండగలమా?”, అని బ్రిట్టనీ ప్రశ్నించారు.


Also Read: ఇసుక మాఫియాని అడ్డకున్న పోలీస్ అధికారి హత్య!

క్వీన్స్ ల్యాండ్ హౌసింగ్ మినిస్టర్ మేగన్ స్కాన్ లాన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. బ్రిట్టనీకి జరిగిన విషయం తెలిసి తాను షాక్ గురయ్యానని అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, హింసకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

బ్రిట్టనీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని క్వీన్స్ ల్యాండ్ పోలీసులు తెలిపారు.

 

 

Tags

Related News

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Big Stories

×