BigTV English

Zomato Pure Veg Fleet : ప్యూర్ వెజ్ ఫ్లీట్ పై విమర్శలు.. వెనక్కి తగ్గిన జొమాటో

Zomato Pure Veg Fleet : ప్యూర్ వెజ్ ఫ్లీట్ పై విమర్శలు.. వెనక్కి తగ్గిన జొమాటో


Zomato Pure Veg Food Delivery Issue : స్విగ్గీ, జొమాటో వంటి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లు అందుబాటులోకి వచ్చాక.. ఆన్లైన్ లో ఏ రకమైన ఫుడ్ కావాలన్నా ఆర్డర్ చేస్తే.. అరగంటలో ఇంటి ముందుంటాయి. వెజ్, నాన్ వెజ్, ఇటాలియన్, థాయ్ ఇలా రకరకాల ఫుడ్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. అయితే.. తాజాగా జొమాటో వెజ్ ఫుడ్ ను సెపరేట్ గా డెలివరీ చేసేందుకు స్పెషల్ గా జొమాటో ప్యూట్ వెజ్ ఫ్లీట్ పేరుతో ప్రకటన చేసింది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది.

ప్యూర్ వెజ్ ఫ్లీట్ ను ప్రారంభిస్తామని ప్రకటించిన కొద్దిసేపటికే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. డెలివరీ బాయ్స్.. గ్రీన్ యూనిఫాం, గ్రీన్ జొమాటో బ్యాగ్స్ తో డెలివరీ చేస్తారని ప్రకటించింది. కాసేపటికే.. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని, ఇకపై డెలివరీ బాయ్స్ అంతా రెడ్ కలర్ టీ షర్ట్స్ తోనే డెలివరీ చేస్తారని తెలిపింది. అయితే ప్యూజ్ వెజ్ ఫ్లీట్ సేవల్ని నిలిపివేయడం లేదని, వెజ్ ఆర్డర్ల కోసం వాళ్లు కూడా ఉంటారని సీఈఓ దీపీందర్ గోయల్ ప్రకటించారు. ఇందులో తమకు ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవన్నారు.


వెజ్ డెలివరీల కోసం ఎందుకు సెపరేట్ గా డెలివరీలు చేయాలని నిర్ణయం తీసుకున్నారో దీపీందర్ వివరించారు. డెలివరీ బాక్సుల్లో ఎంత జాగ్రత్తగా డెలివరీ చేసినా.. ఆహారపదార్థాలు బ్యాగ్ లోపల ఒలుకుతాయని, వెజ్ ఆర్డర్ చేసినపుడు ఆ వాసన వాటికి కూడా అంటుకుంటుందని అందుకే వెజ్ ఆర్డర్లకోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో యూనిఫాం ను మాత్రమే మార్చడం లేదని, వెజ్, నాన్ వెజ్ ఆహారాలను వేర్వేరుగానే డెలివరీ చేస్తారని తెలిపారు.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×