Hyderabad Bike Blast: హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మొఘల్‌పుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని అస్లాం ఫంక్షన్ హాల్ దగ్గర.. బుల్లెట్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైక్ మీద వెళతున్నవారు, స్థానికులు కలిసి మంటలార్పే ప్రయత్నం చేశారు. మంటలార్పే సమయంలో బైక్ ఒక్కసారిగా పేలింది. దీంతో మంటలార్పుతున్న 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంట్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.
బుల్లెట్ బండికి మంటలు.. వ్యక్తికి గాయాలు
హైదరాబాద్ పాతబస్తీ మొఘల్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని మొఘల్ పురా అస్లాం ఫంక్షన్ హాల్ వద్ద బుల్లెట్ వాహనం పై వెళ్తుండగా ఒక్కసారిగా బుల్లెట్ వాహనంలో మంటలు చెలరేగాయి. దీనితో పెట్రోల్ ట్యాంక్ పేలింది. బుల్లెట్ బైక్ పై వెళ్తున్న వ్యక్తికి… pic.twitter.com/xgvXhxPNkp
— ChotaNews (@ChotaNewsTelugu) May 12, 2024