Film industry:చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు అటు అభిమానులనే కాదు ఇటు సినీ సెలబ్రిటీలను కూడా కలవరపాటుకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మొన్నటి వరకు చాలామంది సీనియర్ నటీనటులు వయోభారంతో తుది శ్వాస విడిచారు. మరి కొంతమంది కమెడియన్లు అనారోగ్య బారిన పడి కన్నుమూశారు. అయితే ఇప్పుడు కొంతమంది యంగ్ నటులు ఇతరులకు సహాయం చేయడం కోసం వెళ్లి కన్నుమూయగా… ఇప్పుడు మరొక నటుడు 43 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి..
అసలు విషయంలోకెళితే.. హాంకాంగ్ నటుడు బెంజమిన్ యంగ్ (Benjamin young).ఆగస్టు 11న స్వర్గస్తులయ్యారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు మీడియాతో తెలియజేశారు. ఇకపోతే కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ప్రశాంతంగా బెంజిమన్ కన్నుమూశారు అని ఆయన సోదరుడు కూడా తెలిపారు. అయితే ఈయన మరణానికి అసలు కారణం మాత్రం వీరు తెలియజేయలేదు. ఇకపోతే ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పలు చిత్రాలలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న బెంజిమన్ ఇక లేరు అని తెలిసి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.. ప్రస్తుతం బెంజమిన్ వయసు 43 సంవత్సరాలు కావడం గమనార్హం.
బెంజమిన్ నటించిన చిత్రాలు..
బెంజమిన్ విషయానికి వస్తే.. యంగ్ అండ్ డేంజరస్, ది కాన్ మాన్ 1999, మై గుడ్ బ్రదర్, ది జేడ్ అండ్ ది పీర్ల్ , లైన్ వాకర్ 2: ఇన్ విజిబుల్ స్పై వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.
ALSO READ:The Raja Saab :ప్రభాస్ సినిమాపై హైకోర్టులో కేసు… 218 కోట్ల మోసం?