Intinti Ramayanam Today Episode March 24th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ పార్వతి గుడికి వెళ్తారు అక్కడ భరత్ ని చూసి రాజేంద్రప్రసాద్ కోపం కట్టలు తెంచుకుంటుంది. భరత్ ని నా కూతురు ఎందుకు పెళ్లి చేసుకున్నావు నా కూతురు ఎందుకు మోసం చేశావు ఆస్తి కోసమేనా చేసావా అంటూ దారుణంగా కొడతాడు రాజేంద్రప్రసాద్. అయితే అవని వచ్చి మధ్యలో ఆపుతుంది నువ్వు నీ తమ్ముడు కలిసి నా కూతురి జీవితాన్ని నాశనం చేశారని అంటాడు. అవని ఇప్పటికైనా నేను చెప్పేది వినండి మావయ్య అనేసి అంటుంది ఏం చెప్పాలి ఏం వినాలి అనేసి అరుస్తాడు అక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని పార్వతి రాజేంద్రప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. భానుమతి ఏమైంది రాజేంద్రప్రసాద్ అప్పుడే వచ్చేసావ్ ఏంట్రా అనేసి అడుగుతుంది. పార్వతి ఆ గుడి దగ్గర అవని, ఆ భరత్ కనిపించారు. ఆయన కోపం కట్టలు తెంచుకుంది. పల్లవి కనిపిస్తే కొట్టడం కాదు చంపేయాలని అనిపిస్తుంది. వాడు చేసిన మోసానికి ప్రణతి జీవితం నాశనం అయ్యింది. అలాంటి వాడిని వదిలేయడం కాదు వాడి కాళ్లు చేతులు ఇరగ్గొట్టేలా పోలీసులకు అప్పజెప్పాలి అని పల్లవి అంటుంది. అందరిని నమ్మించి ప్లాన్ చేస్తుంది. పోలీసులను పంపించి ప్రణతిని ఇంటికి రప్పిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని వదిన చెప్పిన నువ్వు ఒప్పించాల్సిన అవసరం లేదు నేను మేజర్ ని నా ఇష్టం వచ్చినట్లు చేసుకొనే హక్కు నాకుంది. అని ప్రణతి. నన్ను బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం నేను తిరిగి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుందని ప్రణతి అంటుంది. నా ఇష్ట ప్రకారం నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఇందులో మీరు ఎవరు జోక్యం చేసుకోవాల్సిన విషయం లేదు నేను వెళ్తున్నాను అనేసి వెళ్ళిపోతుంది బయట అవని చూసి నన్ను క్షమించు వదిన మీ మాట కాదని నేను ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని అంటుంటే బాధగా అనిపించింది అందుకే వచ్చానని ప్రణతి అంటుంది. ప్రణతి మాటలు విన్న ఇంట్ల వాళ్ళందరూ షాక్ అవుతారు. ప్రణతి మాటలు విన్న అవని నువ్వు అనుకున్నది సాధిస్తావు అని అంటుంది..
ఇక భానుమతిని కమల్ ఓ ఆట ఆడుకుంటాడు. అవని వదినని ఇన్ని మాటలు అంటావా అంటూ శిక్షంచాలని ఒక చెట్టుకు కట్టేస్తాడు. కేక్ అని ఒళ్ళంతా పోసి దండకంలో ఇలానే ఉంది చీమలు కుట్టి పాములు కరిచి చచ్చిపోతారు ఇది హింసాత్మకమైన శిక్ష అని కమలు భానుమతికి చుక్కలు చూపిస్తాడు. ఇదంతా చేస్తుంది నేను కాదు పల్లవి శ్రీయాలు వాళ్ళని కూడా శిక్షించాలి కదా అనేసి భానుమతి చెప్తుంది. వాళ్లకు కూడా కఠినమైన శిక్షలు వేస్తానని కమలంటాడు.
అక్షయ్ ఆఫీసులో తన కూతురు బర్త్డే సందర్బంగా స్టాఫ్ అందరికీ ఒక నెల శాలరీని బోనస్ గా ఇస్తాడు. అటు అవని కూడా తన కూతురు బర్తడే కోసమని స్టాఫ్ అందరికీ స్వీట్లు పంచుతుంది. నా కూతురు పుట్టిన రోజుకి నువ్వు స్వీట్లు పంచడమేంటి అనేసి అక్షయ్ అవని అడుగుతాడు. మీరు మీ స్థాయికి తగ్గట్లు స్టాఫ్ అందరికీ బోనస్లిచ్చారు నేను నా తహతుకు తగ్గట్లు స్వీట్లు పంచుతున్నాను అందులో తప్పేంటి అనేసి అవని అంటుంది. అప్పుడు అవనికి ఒక కవర్ ఇస్తాడు. నువ్వు కూడా మా స్టాప్ తో సమానమే కదా నీకు కూడా బోనస్ ఇస్తున్నాను అనేసి అనగానే అవని షాక్ అవుతుంది.
బ్యాగులోంచి డబ్బులు తీసి అక్షయ్ కి ఇవ్వబోతుంది నేను బోనస్ ఇస్తే నువ్వు నాకు డబ్బులు ఇస్తావా అంటే మీ కూతురు పుట్టిన సందర్భంగా మీరు నాకు బోనస్ ఇచ్చారు నా కూతురు పుట్టిన రోజు సందర్భంగా ఈ డబ్బులతో డ్రెస్ కొని తీసుకెళ్లండి అని అంటుంది దానికి అక్షయ్ అలాగే అని అంటాడు. నా కూతురు పుట్టిన రోజుకు ఈ స్వీట్ మీరు తీసుకోవాలని అవని అక్షయకి స్వీట్ ఇస్తుంది.
ఇంట్లోనే వాళ్ళందరూ ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేయాలని రకరకాల ప్లాన్లు వేస్తారు. అక్షయ్ ఈ కూడా వృద్ధాశ్రమానికి డబ్బులు ఇవ్వడం అలాగే స్టాఫ్ అందరికీ బోనస్ ఇవ్వడం చూసి అందరూ మెచ్చుకుంటారు. అటు అవని తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా నేను ఎన్నో చేసేదాన్ని అని బాధపడుతూ ఉంటుంది. అమ్మ అమ్మ అంటూ కలవరిస్తూనే ఉండేది.. నా కూతురు నాకోసం ఎంతగానో బాధపడుతుంది. దానికి స్వరాజ్యం నీ కూతురు దగ్గరికి నువ్వు వెళ్లడానికి పర్మిషన్ ఎవరు ఇవ్వాలి నీకు తోడుగా నేను వస్తాను నువ్వు వెళ్లి నీ కూతుర్ని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేసి రా అనేసి అంటుంది.
అవని మాత్రం అలా చేస్తే ఇంట్లో వాళ్ళందరూ తల ఒక మాట అంటారు నన్ను వాళ్ళందరూ అనడం నా కూతురు విని తట్టుకోలేదు బాధపడుతుంది పిన్ని అని అవని అంటుంది. ఇక ఇంట్లోని వాళ్ళందరూ రాత్రి 12 అయింది కదా అందరూ ఆరాధికి ఒకేసారి విషయాలని బర్త్డే గిఫ్ట్లు అన్ని పట్టుకొని ఆరాధ్య రూమ్ కి వెళ్తారు కానీ అక్కడ ఆరాధ్య లేకపోవడంతో అందరూ టెన్షన్ పడుతూ వెతుకుతారు అవనీనే ఆరాధ్యను తీసుకుపోయి ఉంటుందని పల్లవి అంటుంది. ఇక ఆరాధ్య కోసం అందరూ వెతుకుతుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో అవనిని ఆరాధ్య పుట్టినరోజు సందర్భంగా ఇంటికి తీసుకెళ్తాడు అక్షయ్.. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..