Crime News: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బీబీ గూడెం సమీపంలో కారు, బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
వివరాల ప్రకారం.. కాసేపటి క్రితం సూర్యాపేట జిల్లా బీబీ గూడెం సమీపంలో బస్సు, కారు ఎదురుదెరుగా ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో ముగ్గురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇప్పటి వరకు తెలిసన సమాచారం మేరకు.. పోలీసులు వివరాల ప్రకారం.. ఆర్టీసీ బస్సు- కారు ఢీకొని దంపతులు, ఎనిమిదేళ్ల కుమార్తె ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్ర గాయాల పాలైన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను గడ్డం రవీందర్, రేణుక, రితిక(8)గా పోలీసులు గుర్తించారు. ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న కారు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. భారీ సౌండ్ రావడంతో హుటాహుటిన స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే స్థానికుల సహాయంతో పోలీసులు క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు, కారు వేగంగా రావడం, మలుపు తీసుకొనే క్రమంలో కారు అదుపు తప్పి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జవ్వగా… కారు వెనుక భాగంలో కూర్చొన్న రేణుక, రితిక.. డ్రైవర్ పక్కన కూర్చొన్న రవీందర్ అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలంలో మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వారి బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే, కారు వేగంగా రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? బస్సు వేగంగా రావడం వల్లా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Minister Uttam: తెలంగాణ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. రాష్ట్రంలోని 84% మంది ఈ పథకానికి అర్హులు..
ALSO READ: Live Suicide: లైవ్ పెట్టి మరీ యువకుడి సూసైడ్.. భార్య, అత్త రెచ్చగొట్టడం వల్లే..!