Iran Explosion: ఇరాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ ప్రముఖ ఓడరేవు అయిన హార్ముజ్ జలసంధి ఉత్తర తీరంలో బందర్ అబ్బాస్ సమీపంలోని షాహీద్ రాజీపోర్టులో మధ్యాహ్నం 12:30 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని హార్మోజ్గాన్ నగరంలోని ఆసుపత్రులకు తరలించారు.
సంఘటనా స్థలంలో మంటలు భారీ చెలరేగాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోర్టులోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
భారీ పేలుడు సంభవించిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనాస్థలం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో బిల్డింగ్ అద్దాలు ధ్వంసమైనట్లు స్థానికులు చెబుతున్నారు. భారీ పేలుడు సంభవించండంతో ఓ భవనం నేలమట్టం అయినట్టు అధికారులు చెప్పారు. అయితే, రజేయీ ఓడరేవులో తరుచుగా కంటెయినర్ల కార్యకలాపాలు కొనసాగుతుంటాయి. ఏటా 80 మిలియన్ టన్నుల సరకు ఎగుమతి, దిగుమతి అవుతుందని అధికారులు చెప్పారు. దీని గురించి మరింత సమాచార తెలియాల్సి ఉంది.
Some others have noted similarities between this explosion today and the 2020 Beirut Port explosion from the detonation there of ammonium nitrate.https://t.co/YIIwnCZ3MX
— Jason Brodsky (@JasonMBrodsky) April 26, 2025