Intinti Ramayanam: ఇంటింటి రామాయణం సీరియల్ మాటీవీలో ప్రసారం అవుతుంది. సీరియల్ లో ప్రతి ఒక్కరూ వారి పాత్రల లో అద్భుతంగా నటిస్తూ సీరియల్ ని టిఆర్పి రేటింగ్స్ లో దూసుకుపోయేలా చేశారు. మంచి కుటుంబ కథాగా ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హిందీ సీరియల్ కహాని ఘర్ ఘర్ సీరియల్ కు రీమేక్ గా ఈ సీరియల్ రూపొందించారు.ఈ సీరియల్ లో అవని పాత్ర చాలా కీలకం అని చెప్పొచ్చు. ఈమె అసలు పేరు పల్లవి రామశెట్టి. అత్తారింటికి దారేది, ఆడదే ఆధారం, భార్యామణి వంటి సీరియల్స్ తో ఆకట్టుకున్నరు పల్లవి రామశెట్టి. ఈమె షూటింగ్ స్పాట్లో కొంత విరామం దొరకగానే తోటి నటీనటులతో రిల్స్ చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. తాజాగా సీరియల్ షూటింగ్ లో భాగంగా, ఆమె పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. తన ఇంస్టాగ్రామ్ లో సీరియల్ కష్టాలు అంటూ ఆమె చేసిన పోస్ట్ గురించి మనము తెలుసుకుందాం..
సీరియల్ కష్టాలు ..
ఇంటింటి రామాయణం సీరియల్ కుటుంబ విలువలు గురించి తెలిపే కథగా మన ముందుకు వచ్చింది. ఈ సీరియల్ స్టార్ మా లో ప్రసారం అవుతుంది. తాజాగా అవని క్యారెక్టర్ లో నటిస్తున్న పల్లవి రామిశెట్టి, తన ఇంస్టాగ్రామ్ లో సీరియల్ కష్టాలు అంటూ చేసిన పోస్ట్ చూస్తే నిజంగా వారు ఎంతో కష్టపడి సీరియల్ చేస్తున్నారని మనకు అర్థం అవుతుంది. వేసవి కాలం కావడంతో సీరియల లో యాక్టర్స్ అందరూ వారి మేకప్ పోకుండా ఎంతో కష్టపడి, షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నారు. హైదరాబాద్ ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అక్కడ షూటింగ్ అంటే ఎంత కష్టంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు, ఇప్పుడు ఇదే విషయాన్ని పల్లవి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేకపోతున్నట్లు, షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి ప్రతి ఒక్కరికి ఉన్న ఓపిక కూడా పూర్తిగా అయిపోతున్నట్లు ఆమె వీడియో రూపంలో తెలిపింది. ఇది చూసిన వారంతా నిజంగా సీరియస్ చేయడం ఇంత కష్టమా అని, అందరూ ఎంతో కష్టపడి చేస్తున్నారు అని సమ్మర్ అంటే ఆ మాత్రం కష్టం ఉంటుంది అని కామెంట్ చేస్తున్నారు.
కుటుంబ కథ ..
ఇక సీరియల్ ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్ అన్ని ప్రేక్షకు ఆదరణ పొందాయి. సీరియల్ టైం అయ్యే సరికి అభిమానులంతా టీవీల ముందు వాలిపోతారు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసిచూడదగిన సీరియల్ ఇది. స్టార్ మా లో వచ్చే సీరియల్స్ అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి చూసే విధంగా ఉంటాయి. కార్తీకదీపం బ్రహ్మముడి ఆ తర్వాత ఇంటింటి రామాయణం. ఈ సీరియల్లో ఒక ఉమ్మడి కుటుంబంగా మొదట మనకి చూపిస్తారు. అందులోని కీలక పాత్రలో అక్షయ్ – అతని భార్య అవని ఆ కుటుంబాన్ని ముక్కలు చేయకుండా కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబంలో మరో కోడలిగా వచ్చిన పల్లవి కుటుంబాన్ని రెండుగా చీల్చడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. పెద్ద కోడలుగా అవనీ కుటుంబం ని కాపాడడానికి ప్రయత్నిస్తుంది. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలను, అభిమానులు ఆసక్తిగా చూస్తారు. సీరియల్ హాట్ స్టార్ లో ott లోను చూడొచ్చు. ఇప్పటికీ ఈ సీరియల్ 276 ఎపిసోడ్ లను ఈరోజుతో కంప్లీట్ చేసుకుంది. మరెన్నో ఎపిసోడ్ లతో, ముందుకు సాగాలని మనము కోరుకుందాం.
?igsh=Mzluejk4N2s2djU2