BigTV English

Toothache: క్యావిటీస్ లేకపోయినా పన్ను నొప్పి వస్తుందా? లైట్ తీసుకుంటే అంతే..

Toothache: క్యావిటీస్ లేకపోయినా పన్ను నొప్పి వస్తుందా? లైట్ తీసుకుంటే అంతే..

Toothache: పన్ను పుచ్చిపోవడం, లేదా కావిటీస్, చాలా మంది ఎదుర్కొనే సాధారణ దంత సమస్య. క్యావిటీస్ కారణంగా పంటి నొప్పి వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొందరికి పన్ను పుచ్చిపోకపోయిన చాలా సార్లు నొప్పిగా అనిపిస్తుంది. దీని వల్ల నిద్ర కూడా పట్టదు. పన్ను నొప్పి వల్ల ఎదైనా తినాలన్నా కష్టతరంగా మారుతుంది. అసలు పళ్లు పుచ్చిపోకపోయినా నొప్పి రావడానికి అనేక కారణాలు ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు చుద్దాం..


క్యావిటీస్ ఉంటే?
కొన్నిసార్లు, పన్ను చుట్టూ ఉన్న చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ లేదా వాపు రావడం వల్ల కూడా నొప్పి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇదివరకే పుచ్చు పళ్లకు ట్రీట్మెంట్ తీసుకున్న వారి విషయంలో అయితే ఫిల్లింగ్ ప్రక్రియ సమయంలో చిగుళ్లకు గాయమైతే బాగా నొప్పి వచ్చే అవకాశం ఉందని డెంటిస్ట్‌లు చెబుతున్నారు. ఈ రకంగా వచ్చే నొప్పి చాలా తక్కువ కాలం ఉంటుంది. యాంటీబయోటిక్స్ వాడడం, నోటిని సక్రమంగా శుభ్రం చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

పంటి నొప్పి ఎందుకు?
కొందరికి ఏదైనా యాక్సిడెంట్ వంటివి జరిగినప్పుడు పన్ను పగలడం వల్ల నొప్పి వస్తుంది. ఆ సమయంలో ఆహారం లేదా బ్యాక్టీరియా లోపలికి వెళ్లి నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో ఫిల్లింగ్‌ చేయిస్తే మంచిది.


మరికొందరికి సెన్సిటివిటీ కారణంగా చల్లని లేదా వేడి పదార్థాలు తిన్నప్పడు పంటి నొప్పి రావచ్చని నిపుణులు చెబుతున్నారు. పళ్లను రక్షించే ఎనామెల్ అరిగిపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుందట.

కొన్ని సందర్భాల్లో దవడ జాయింట్ (TMJ) సమస్యలు లేదా ఒత్తిడి వల్ల పంటి నొప్పి వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మందిలో సైనస్ సమస్యలు కూడా పంటి నొప్పికి కారణం అవుతాయట. దీని వల్ల దవడలో నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది.

కొన్ని సార్లు అధిక ఒత్తిడి కారణంగా కూడా పంటి నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుందట. ఒత్తిడి వల్ల నరాలపై చెడు ప్రభావం పడుతుంది. ఫలితంగా పంటి నొప్పి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని డెంటిస్ట్‌లు చెబుతున్నారు.

ఇలా చేస్తే నొప్పి ఉండదు..!
తరచుగా పంటి నొప్పి వేదిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీని ప్రభావాన్ని కొంతవరకైనా తగ్గించగలిగే ఛాన్స్ ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రోజూ రెండుసార్లు బ్రష్ చేయడం, ఫ్లాస్ ఉపయోగించడం ద్వారా చిగుళ్లను ఆరోగ్యంగా ఉంటాయట. సెన్సిటివిటీతో ఇబ్బంది పడుతున్న వారు డాక్టర్ సిఫార్సు చేసిన టూత్ పేస్ట్‌ని వాడడం మంచిది.

ALSO READ: ఆహారం సరిగా నమలకుండా తింటున్నారా?

రోజూ పంటి నొప్పి వేదిస్తే గట్టి ఆహారం నమలకుండా జాగ్రత్త వహించాలి. అలాగే ఒత్తిడిని తగ్గించడానికి యోగా లేదా మెడిటేషన్ ట్రై చేయడం మంచిది.

బ్యాక్టీరియా కారణంగా పంటి నొప్పి వస్తోంది అనిపిస్తే ప్రొఫెషనల్ క్లీనింగ్ చేయించుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వైద్య సలహా అవసరమా?
పంటి నొప్పి ఎక్కువ కాలం ఇబ్బంది పెడితే, వెంటనే దంత వైద్యుడిని సంప్రదించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×