700 Women Dating Scam| ఒక యువకుడు ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతను ఇది చాలదన్నట్లు రాత్రి వేళ ఆన్‌లైన్ లో యువతులను పరిచయం చేసుకొని.. వారితో స్నేహం చేసేవాడు. వారిని ప్రేమిస్తున్నట్లు నటించి వారిని బ్లాక్ చేసేవాడు. అలా ఏకంగా 700 మహిళలను మోసం చేశాడని పోలీసులు తెలిపారు. చివరికి ఒక యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు నానా కష్టాలుపడి అతడిని పట్టుకున్నారు. ఈ ఘటన ఢిల్లీ సమపంలోని నోయిడా ప్రాంతంలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నోయిడా నగరానికి చెందిన తుషార్ సింగ్ బిష్త్ (23) అనే యువకుడు బిబిఏ డిగ్రీ పూర్తి చేశారు. అతని తండ్రి ఒక డ్రైవర్. తల్లి ఒక గృహిణి. అతనికి ఒక సోదరి కూడా ఉంది. ఆమె కూడా ఉద్యోగం చేస్తోంది. గత మూడేళ్లుగా నోయిడాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో తుషార్ సింగ్ టెక్నికల్ రిక్రూటర్ గా మంచి స్థాయి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతను ఉద్యోగం కంపెనీలో ఉద్యోగం చేశాక.. రోజు ఇంటికి వెళ్లి తన గదిలో ఎవరినీ రానిచ్చేవాడు కాదు.
గదిలోపల అతను కంప్యూటర్ లో డేటింగ్ యాప్స్.. స్నాప్ చాట్, బంబల్ ద్వారా యువతులతో స్నేహం చేసేవాడు. అయితే తాను అమెరికాలో మాడలింగ్ చేస్తున్నానని చెబుతూ తన ఫొటోకు బదులుగా ఒక అమెరికన్ ఫొటో చూపించేవాడు. కంపెనీలో రోజూ అమెరికన్ క్లైంట్స్ తో మాట్లాడుతూ తుషార్ సింగ్ అమెరికన్ ఇంగ్లీషు యాస బాగా నేర్చుకున్నాడు. దీంతో అతడి మాటలు విన్న యువతులు ఈజీగా నమ్మేశారు. అయితే ప్రారంభంలో ఇదంతా తుషార్ సింగ్ తన సరదా కోసం చేసేవాడు. కానీ యువతులతో ప్రేమిస్తున్నానని ఆ తరువాత డ్రామా చేశాడు. వారికి మాయమాటలతో అమెరికా తీసుకెళతానని నమ్మించి.. వారు బట్టలు లేకుండా ఉండే సమయంలో చాటింగ్ చేసేవాడు. ఇదంతా వారికి తెలియకుండానే మొబైల్ ద్వారా వీడియో రికార్డింగ్ చేసేవాడు.
Also REad: ప్రియురాలి కోసం అక్రమంగా పాకిస్తాన్ వెళ్లిన భారతీయుడు.. మోసం చేసిన యువతి..కానీ..
ఆ తరువాత వారికి ఆ వీడియోలు చూపించి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఇవ్వకపోతే వీడియోలు ఆన్ లైన్ లో ఇతరులకు షేర్ చేస్తానని బెదిరించేవాడు. అతడి బెదిరింపులకు భయపడి పోయిన యువతులు.. ఈ విషయాలను బయటికి ఎవరికీ చెప్పుకోలేక.. డబ్బులు ఇచ్చేసేవారు. అలా తుషార్ సింగ్ దాదాపు 700 మహిళలను బ్లాక్ మెయిల్ చేశాడు. కానీ జనవరి 2023లో పరిచయమైన ఒక యువతిని తుషార్ సింగ్ ఇలాగే మోసం చేశాడు. కానీ ఆ యువతి ధైర్యం చేసి డిసెంబర్ 2024లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ కేసులో విచారణ మొదలుపెట్టిన పోలీసులకు నిందితుడు ఎవరో కనిపెట్టడం చాలా కష్టమైంది. ఎందుకంటే తుషార్ సింగ్ ఒక వర్చువల్ నెంబర్ ద్వారా మారు పేరుతో సంప్రదించేవాడు. అయినా పోలీసులు .. ఈ కేసుని సవాల్ గాతీసుకొని విచారణ జరిపారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం తుషార్ సింగ్ ఉపయోగించే కంప్యూటర్ ఐపి అడ్రస్ తెలుసుకున్నారు. ఆ తరువాత అతని ఇంటికి వెళ్లి చూడగా.. అతను పరారీలో ఉన్నాడని తెలిసింది. అయినా పట్టువదలని సైబర్ క్రైమ్ పోలీసులు.. శుక్రవారం జనవరి 3 2025న ఢిల్లీలోని శాకర్‌పూర్ ప్రాంతంలో తుషార సింగ్ ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నారు.
తుషార్ సింగ్ వద్ద నుంచి పోలీసులు 13 క్రెడిట్ కార్డులు, అతను ఉపయోగించిన అంతర్జాతీయ వర్చువల్ అకౌంట్ నెంబర్, రెండు బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. ప్రస్తుతం తుషార్ సింగ్ చేతిలో మోసపోయిన మరో నలుగురు యువతులు కూడా ఫిర్యాదు చేశారు. తుషార్ సింగ్ వద్ద నుంచి దోపిడీ సొమ్ముని రికవర్ చేసి బాధితులకు అప్పగించేందుకు అతని బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నామని వెస్ట్ ఢిల్లీ సైబర్ పోలీస్ ఎసీపి అరవింద్ యాదవ్ వెల్లడించారు.