BigTV English

Pant Fifty: పగబట్టినట్లుగా పంత్ విధ్వంసం.. కష్టాల్లో భారత్!

Pant Fifty: పగబట్టినట్లుగా పంత్ విధ్వంసం.. కష్టాల్లో భారత్!

Pant Fifty: బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 2024 – 25 లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదవ టెస్ట్ లోని రెండవ రోజు ఆట రసవత్తరంగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి భారత జట్టుకు నాలుగు పరుగుల స్వల్ప ఆదిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇక తన రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు మరోసారి తడబడింది.


Also Read: Jasprit Bumrah Injury: టీమిండియాకు షాక్‌.. బుమ్రాకు గాయం..ఆస్పత్రికి తరలింపు !

ఒపెనర్లు యశస్వి జైస్వాల్ (22), కేఎల్ రాహుల్ (13) తొలి వికెట్ కి 42 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన ఈ ఇద్దరు ఓపినర్లు స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. ఇక గిల్ (13) పరుగులు చేసి వెనుదిరిగాడు. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన బలహీనతకే అవుట్ కావడం గమనార్హం. కేవలం 6 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో ఆఫ్ సైడ్ వచ్చిన బంతిని ఆడేందుకు ప్రయత్నించి స్లిప్ లో ఉన్న స్మిత్ కి క్యాచ్ ఇచ్చాడు.


దీంతో తనని తానే తిట్టుకున్నాడు కోహ్లీ. ఫ్రస్టేషన్ లో గట్టిగా అరిచాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాట్ ఝలిపించాడు. టి-20 తరహాలో సిక్సర్లు, ఫోర్లతో ఆసీస్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. కేవలం 29 బంతులలో హఫ్ సెంచరీ పూర్తి చేశాడు పంత్. ఇందులో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. మొత్తంగా 32 బంతులలో 61 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

దూకుడుగా ఆడుతున్న రిషబ్ పంత్ ని 61 పరుగుల వద్ద కమీన్స్ అవుట్ చేశాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి కూడా కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 141 పరుగులు చేసి ఆరు వికెట్లను కోల్పోయింది. టీమిండియా ప్రస్తుతం 145 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది. రవీంద్ర జడేజా (8*), వాషింగ్టన్ సుందర్ (6*) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 4, వెబ్ స్టర్ 1, కమీన్స్ 1 వికెట్లు పడగొట్టారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం 29 బంతులలో హాఫ్ సెంచరీ పూర్తిచేసిన రిషబ్ పంత్ రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 2022లో శ్రీలంకపై 28 బంతులలో ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు పంత్.

Also Read: Rohit sharma Retirement: నేను పిచ్చోన్నికాదు…రిటైర్మెంట్‌ పై రోహిత్‌ సంచలన ప్రకటన !

ఇప్పుడు మరోసారి 29 బంతుల్లో హఫ్ సెంచరీ పూర్తి చేసి రెండవ స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచాడు కపిల్ దేవ్. 1982లో కపిల్ దేవ్ పాకిస్తాన్ పై 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అలాగే శార్దూల్ ఠాకూర్ ఇంగ్లాండ్ పై 2021లో 31 బంతులలో హాఫ్ సెంచరీ, 2024 లో యశస్వి జైస్వాల్ బంగ్లాదేశ్ పై 31 బంతులలో హాఫ్ సెంచరీ చేశాడు.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×