Game Changer Pre Release Event: సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే హీరోలు అందరినీ ఒకేచోట చూడొచ్చని ప్రేక్షకులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా ఈ ఈవెంట్స్ ఓపెన్ గ్రౌండ్స్‌లో జరగడం వల్ల లెక్కలేనంత మంది జనాలు కూడా వస్తారు. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. దానికోసం భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. జనవరి 4న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని, దానికి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ అని ఇప్పటికే ప్రకటించారు. కానీ అంతే కాకుండా దీనికోసం మరెన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.
ఈవెంట్ సెట్
శంకర్, రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ కోసం ఫ్యాన్స్ అంతా మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అసలైతే ఈ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ విడుదలయిన కొంతకాలానికే విడుదల కావాల్సింది కానీ పలు కారణాల వల్ల ఇప్పటివరకు రిలీజ్ అవ్వలేదు. జనవరి 10న ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అన్నప్పుడు కూడా చాలామంది ప్రేక్షకులు నమ్మలేదు. కానీ ఫైనల్‌గా ప్రమోషన్స్ కూడా మొదలయిన తర్వాత మూవీ రిలీజ్ ఫిక్స్ అని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
Also Read: ‘విశ్వంభర’ నుండి వారంతా ఔట్.. అదే కారణమా.?
దారి మళ్లింపు
‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వస్తున్నారని ప్రేక్షకులకు తెలిసిపోయింది. అయితే ఆయనతో పాటు ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి కూడా రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ను ఒకే వేదికపై చూసి చాలాకాలం అయ్యింది. రాజమండ్రిలోని వేమగిరి జాతీయ రహదారి పక్కన ఉన్న లేఔట్‌లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ భారీ మెగా ఈవెంట్ కోసం పోలీసులు పక్కా బందోబస్తుతో సిద్ధంగా ఉన్నారు. ఈ ఈవెంట్ కోసం కోలకత్తా, చెన్నై రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. భారీ వాహనాలు గోదావరి నాలుగో వంతెన మీదుగా మళ్లిస్తున్నారు.
ఈవెంట్ ప్రత్యేకతలు
‘గేమ్ ఛేంజర్’ సినిమా అనేది ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ కెరీర్‌లో ప్రెస్టీజియస్‌గా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది కాబట్టి దీనికి కేవలం పవన్ కళ్యాణ్, చిరంజీవి మాత్రమే కాకుండా మిగతా మెగా హీరోలు కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మెగా హీరోలు అందరినీ ఒకే స్టేజ్‌పై చూడడానికి దాదాపు లక్ష మంది ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. అందుకే అంతమంది జనాలను కంట్రోల్ చేయడం కోసం దాదాపు 1200 మంది పోలీసులు బందోబస్తుగా ఉండబోతున్నారు. 50 అడుగుల ఎత్తులో స్టేజ్‌ను ఏర్పాటు చేశారు. దాదానె 20 వేల బండ్లు పార్కింగ్ చేసుకునేలా 5 చోట్లను ఏర్పాటు చేశారు. వేడుకకు వచ్చిన అభిమానులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.