Bihar Road Accident: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రక్కు ఢీ కొని ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని కటిహార్ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగింది ఈ ఘటన. వేగంగా వస్తున్న స్కార్పియోను ట్రాక్టర్ ఢీకొట్టింది. కారులో 10 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరంతా ఓ వివాహ వేడుకకు వెళుతుండగా.. ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఆ ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
బీహార్‌లోని వేరే ప్రాతంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. సోదరుల పెళ్లి విందుకు పెరుగు బకెట్లు కొనడానికి.. అని ముగ్గురు యవకులు బయటకు వెళ్లారు. తిరిగి వస్తుండగా హాజీపూర్-మహానార్ ప్రధాన రహదారిపై ట్రక్కు ఢీకొని ముగ్గురూ నుజ్జునుజ్జయ్యారు. ఈ ప్రమాదంలో సోను కుమార్ (17), రాజీవ్ కుమార్ (15), రంజన్ కుమార్ (16) మరణించారు. ముగ్గురూ చంద్‌పురా గ్రామ నివాసితులు. సోను చెల్లెలి వివాహం సోమవారం జరగాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో విషాదం జరిగింది. ఫుట్‌పాత్ పై ఉన్న హోటల్లోకి ఓ లారి దూసుకెళ్ళడంతో మహిళ స్పాట్‌లోనే చనిపోయింది. మృతురాలి భర్తకు తీవ్రగాయాలవ్వడంతో జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడినుండి పరారయ్యాడు. జడ్చర్ల-కోదాడ నేషనల్ హైవే పై ఈ ప్రమాదం జరిగింది. కల్వకుర్తి వైపు నుండి జడ్చర్ల సైడ్ వెళ్తున్న లారీ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని చెప్తున్నారు స్థానికులు.
Also Read: మర్మాంగాలను కొరికి తిని..పెంపుడు కుక్క దాడికి బలైన ఓనర్
మరోవైపు ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ను దర్శించుకునేందుకు వెళ్లారు గాజువాక GVMC టాక్స్ కలెక్టర్ పాలవెల్లి. కేదార్‌నాథ్ యాత్రలో ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులకు గురై పాలవెల్లి మృతిచెందారు. అధికారులు కలెక్టర్ పాలవెల్లి మృతదేహాన్ని ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి స్వగ్రామమైన విశాఖకు తరలిస్తున్నారని తెలిపారు. పాలవెల్లి మృతితో కూర్మాన్న పాలెంలోని కుటుంబంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.