BigTV English

OTT Movie : రాజుతో ఆ పని కోసం ముసలమ్మల ఆరాటం… కాటికి కాళ్ళు చాపే వయసులో ఇవేం పాడు పనులురా సామీ

OTT Movie : రాజుతో ఆ పని కోసం ముసలమ్మల ఆరాటం… కాటికి కాళ్ళు చాపే వయసులో ఇవేం పాడు పనులురా సామీ

OTT Movie : ఫ్యాంటసీ సినిమాలు మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. వీటిని చూస్తున్నంతసేపు బాగా ఎంటర్టైన్ అవుతుంటారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ, మూడు స్టోరీల చుట్టూ తిరుగుతుంది. ఈ స్టోరీలు చూపు తిప్పుకోకుండా చేస్తాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ ఫ్యాంటసీ హారర్ మూవీ పేరు’టేల్ ఆఫ్ టేల్స్’ (Tale of Tales). 2015 లో వచ్చిన ఈ సినిమాకి మాట్టియో గారోనే దర్శకత్వం వహించారు. ఇటాలియన్ రచయిత జియాంబట్టిస్టా బాసిలే రాసిన 17వ శతాబ్దపు నీతి కథల ‘పెంటామెరోన్’ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా మూడు వేర్వేరు కథలను అల్లుకుంటూ వెళ్తుంది. ఇందులో సల్మా హాయెక్, విన్సెంట్ కాసెల్, టోబీ జోన్స్, జాన్ సి. రీలీ వంటి నటులు నటించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

లాంగ్‌ట్రెల్లిస్ రాజ్యం

లాంగ్‌ట్రెల్లిస్ రాజ్యంలో రాణికి పిల్లలు లేకపోవడంతో, సంతానం కోసం తీవ్రంగా ఆరాటపడుతుంది. ఒక సముద్ర డ్రాగన్ హృదయాన్ని ఒక కన్య చేత వండించి, రాణి తినడం ద్వారా గర్భం దాల్చవచ్చని రాజు తెలుసుకుంటాడు. రాజు డ్రాగన్‌ను చంపి దాని హృదయాన్ని తీసుకొస్తాడు. రాణి డ్రాగన్ హృదయాన్ని తిని, ఎలియాస్ అనే బిడ్డను కంటుంది. అదే సమయంలో, హృదయాన్ని వండిన కన్య కూడా జోనాహ్ అనే బిడ్డను కంటుంది. ఈ ఇద్దరు పిల్లలు మంచి స్నేహితులుగా మారతారు. ఇది రాణికి ఈర్ష్యను కలిగిస్తుంది. ఆమె జోనాహ్‌ను చంపడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఎలియాస్ అతన్ని రక్షిస్తాడు. ఈ క్రమంలో రాణి అనుకోకుండా మరణిస్తుంది. ఆ తరువాత ఎలియాస్ రాజ్యానికి రాజు అవుతాడు.

స్ట్రాంగ్‌క్లిఫ్ రాజ్యం

స్ట్రాంగ్‌క్లిఫ్ రాజ్యంలో రాజుకి కామ కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఒకరోజు డోరా అనే ఒక స్త్రీ పాడిన పాటను విని, ఆమెను కోరుకుంటాడు. ఆమె అందాన్ని చూసి ఏదో రాజ్యానికి రాణి అయివుంటుందని భావిస్తాడు. కానీ ఆమె వాస్తవానికి ముసలి వయసులో ఉంటుంది. ఆమె తన సోదరి ఇమ్మాతో కలసి నివసిస్తూ ఉంటుంది. డోరా చీకటిలో రాజుతో రాత్రి గడపడానికి అంగీకరిస్తుంది. ఎందుకంటే ఆమె రాత్రి పూట మాత్రమే అందంగా కనిపిస్తుంది. పగలు తన వయస్సును దాచడానికి ప్రయత్నిస్తుంది. అయితే రాజుకి ఆమె నిజస్వరూపం తెలిసిపోతుంది. ఆమె ఎలాగో అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడుతుంది. ఆ తరువాత ఒక మంత్రగత్తె  ఆమెను పూర్తి యవ్వన రూపంలోకి మారుస్తుంది. రాజు ఆమెను మళ్లీ చూసినప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు రాజు ఆమెను రాణిగా చేసుకుంటాడు.

హైహిల్స్ రాజ్యం

హైహిల్స్ రాజ్యంలో, రాజు ఒక పేనును పెంచడంలో మునిగిపోతాడు. ఇది చాలా పెద్ద పరిమాణంలోపెరుగుతుంది. ఒక రోజు ఆ పేను చనిపోతుంది. రాజు దాని చర్మాన్ని చూపించి, దాన్ని గుర్తించిన వ్యక్తికి తన కూతురు వయోలెట్‌ను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. ఒక ఓగ్రే దీనిని సరిగ్గా గుర్తిస్తాడు. వయోలెట్‌ను తనతో పాటు తీసుకెళ్తాడు. అయితే అతని చేతుల్లో ఆమె బందీగా ఉంటుంది. ఒక సర్కస్ బృందం సహాయంతో వయోలెట్ అతని నుంచి తప్పించుకుంటుంది. ఓగ్రే వారిని వెంబడించి, ఆ సర్కస్ బృందాన్ని చంపేస్తాడు. వయోలెట్ ధైర్యంగా ఓగ్రేను ఎదిరించి, అతన్ని చంపి, తన రాజ్యానికి తిరిగి వస్తుంది. ఆమె తండ్రి వయోలెట్ ను రాణిగా ప్రకటిస్తాడు. ఇలా ఈ మూడు స్టోరీలతో ఈ సినిమా ముగుస్తుంది.

Read Also : భర్తను చంపి శృం*గా*రంలో మునిగిపోయే జంట… ఈ సినిమాను ఒంటరిగానే చూడండయ్యా

Related News

OTT Movie : తలపై రెడ్ లైన్స్… తలరాత కాదు ఎఫైర్స్ కౌంట్… ఇండియాలో వైరల్ కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

OTT Movie : పిల్లోడిని చంపి సూట్ కేసులో… మైండ్ బెండయ్యే కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చి పక్కింటి అమ్మాయితో… కారు పెట్టిన కార్చిచ్చు… దిమాక్ కరాబ్ ట్విస్టులు సామీ

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల ముందే తల్లిపై అఘాయిత్యం… సైతాన్ లా మారే కిరాతక పోలీస్… క్లైమాక్స్ లో ఊచకోతే

OTT Movie : కాల్ సెంటర్ జాబ్ లో తగిలే కన్నింగ్ గాడు… ఫోన్లోనే అన్నీ కానిచ్చే కస్టమర్లు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : ఆసుపత్రిలో దిక్కుమాలిన పని… ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఏంది భయ్యా ఈ అరాచకం

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

Big Stories

×