Visakhapatnam: సమ్మర్ వచ్చిందంటే పిల్లలను తీసుకుని బయటకు వెళ్లేందుకు హడలిపోతున్నారు తల్లిదండ్రులు. వేడిమి నుంచి ఉపశమనం కలిగేందుకు స్పోర్ట్స్ స్విమ్మింగ్ పూల్స్‌కు తీసుకెళ్తున్నారు. అనుకోకుండా చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ఘటన విశాఖలో ఒకటి జరిగింది.
సరదాగా ఈత కొట్టేందుకు స్విమ్మంగ్ ఫూల్‌కు వెళ్లిన 8 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన విశాఖలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. విశ్వనాధ్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఈ ఘటన జరిగింది. చనిపోయిన బాలుడ్ని గుట్టుచప్పుడు కాకుండా బైక్‌పై ఆసుపత్రికి తరలించారు స్పోర్ట్స్ క్లబ్ సిబ్బంది.
ఈ విషయం తెలుసుకొని ఆసుపత్రికి బాలుడి బంధువులు చేరుకున్నారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. ఈ క్రమంలో బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడు 8 ఏళ్ల రిషిగా గుర్తించారు.
అసలేం జరిగింది?
విశాఖ సిటీలోని మురళీనగర్‌కు చెందిన ఎనిమిదేళ్ల వాసుపల్లి రుషి తల్లి కల్పన, బంధువుల పిల్లలతో కలిసి అక్కయ్యపాలెంలోని పోర్టు స్టేడియానికి వచ్చారు. సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లారు. చిన్నారులది కావడంతో పెద్దలకు ప్రవేశం లేదు.
ALSO READ: ప్రసన్న-దివ్య విడాకుల వ్యవహారం కొత్త మలుపు
బాలుడి తల్లి, బంధువులు పక్కనే ఉన్న షాపుకి వెళ్లారు. రుషి స్విమ్మింగ్ పూల్‌లో జారుడు బల్ల నుంచి నీటిలోకి జారిన తర్వాత ఎలాంటి చలనం లేదు. ఈలోగా పక్కన ఆడుకోవడానికి వచ్చిన పిల్లలు రుషి తల్లికి ఈ విషయం చెప్పారు. కంగారు ఆమె లోపలికి వెళ్లింది. అప్పటికే బాలుడు మృతి చెందాడు. వెంటనే సీతమ్మధారలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.
గతంలో ఇలాంటి ఘటన
ఈ ఘటనపై మృతుడి బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు పోలీసులు. బాలుడు తండ్రి షిప్పింగ్ బోట్ వ్యాపారం చేస్తున్నాడు. రెండేళ్ల కిందట విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలోని ఎస్‌ఆర్ పురంలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.
ఇంటికి సమీపంలో ఓ రిసార్టులోని స్విమ్మింగ్ పూల్‌లో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పెందుర్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు, స్థానికుల సాయంతో వెతికినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఓ రోజు బాలుడి మృతదేహాన్ని ఇంటి ఎదురుగా ఉన్న లారీ యార్డు వద్ద స్థానికులు గుర్తించారు.
పాముకాటుతో బాలుడు చనిపోయి ఉంటాడని కుటుంబసభ్యులు భావించారు. చివరకు పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ పడి ప్రాణాలు పోగొట్టుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. స్విమ్మింగ్ పూల్ మరణాలు ఇప్పుడే కాదు గతంలో చాలానే చోటు చేసుకున్నాయి. అయినా సరే చిన్నారులు వెళ్లడం, ప్రాణాల మీదకు తెచ్చుకోవడం జరుగుతోంది.
ALSO READ: భర్తను చంపి డ్రమ్ములో పెట్టిన భార్య