BigTV English

Weight Gain: ఇలా చేస్తే.. చాలు, 30 రోజుల్లోనే ఈజీగా బరువు పెరుగుతారు !

Weight Gain: ఇలా చేస్తే.. చాలు, 30 రోజుల్లోనే ఈజీగా బరువు పెరుగుతారు !

Weight Gain Tips:  ఒకవైపు ఊబకాయం సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటే మరి కొందరు బరువు పెరగడానికి నానా పాట్లు పడుతుంటారు. బరువు తక్కువగా ఉండటం వల్ల శరీరం బలహీనంగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. ఇది కొన్నిసార్లు ఆరోగ్య సంబంధిత సమస్యలకు కూడా దారితీస్తుంది.ఇదిలా ఉంటే.. బరువు పెరగడం అంత తేలికైన పని కాదు. కానీ కొన్ని హోం టిప్స్ పాటించడం వల్ల 30 రోజుల్లోనే బరువు పెరుగుతారు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


పాలు, అరటిపండు – బలాన్ని పెంచే క్లాసిక్ కాంబినేషన్:
పాలు, అరటిపండు బరువు పెరగడానికి సులభమైన, అత్యంత ప్రభావ వంతమైన మార్గాల్లో ఒకటి. ప్రతిరోజు ఉదయం అల్పాహారంగా ఒకటి లేదా రెండు పండిన అరటి పండ్లతో ఒక గ్లాసు ఫుల్ క్రీమ్ పాలు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు లభిస్తాయి. అంతే కాకుండా ఇది కండరాలను బలోపేతం చేయడమే కాకుండా, ఆకలిని కూడా పెంచుతుంది. పాలలో ఉండే పోషకాలు కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. అంతే కాకుండా బరువు పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.

నెయ్యి, చక్కెర – పురాతన ఆరోగ్య రహస్యం:
నెయ్యి, చక్కెర మిశ్రమం బరువు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. 1 టీస్పూన్ నెయ్యిలో 1 టీస్పూన్ చక్కెర కలిపి రోజూ భోజనానికి ముందు తినండి. ఇది శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు, కేలరీలను అందిస్తుంది. క్రమంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. నెయ్యిలో ఉండే లక్షణాలు బరువు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. బరువు పెరగాలని అనుకునే వారు ప్రతి రోజూ నెయ్యిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి.


డ్రై ఫ్రూట్స్ – శక్తి, పోషకాహారానికి పవర్‌హౌస్:
బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ బరువును పెంచడమే కాకుండా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను కూడా అందిస్తాయి. ప్రతిరోజూ పాలతో కలిపిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కండరాల పెరుగుదల, స్టామినా పెరుగుతుంది. అంతే కాకుండా తక్కువ సమయంలోనే బరువు పెరగడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

బంగాళదుంప – సహజ కార్బోహైడ్రేట్ల మూలం:
బంగాళదుంపలలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు, స్టార్చ్ ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి సహాయపడతాయి. ఉడికించిన లేదా కాల్చిన బంగాళదుంపలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అదనపు శక్తి లభిస్తుంది. బరువు కూడా క్రమంగా పెరుగుతుంది.

Also Read: సమ్మర్‌లో ఈ ఫేస్ ప్యాక్ వాడితే.. మీ అందం రెట్టింపు

అశ్వగంధ – ఆయుర్వేద బల రహస్యం:
అశ్వగంధ అనేది ఒక శక్తివంతమైన ఆయుర్వేద మూలిక. ఇది బరువు పెరగడానికి సహాయపడటమే కాకుండా శరీరం నుండి బలహీనత, ఒత్తిడిని కూడా తొలగిస్తుంది. ప్రతి రోజు రాత్రి పాలలో 1 టీస్పూన్ అశ్వగంధ పొడిని కలిపి తాగడం వల్ల కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది ఆకలిని కూడా పెంచుతుంది. ఫలితంగా బరువు పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.

Related News

Yoga For Brain Health: ఈ యోగాసనాలతో.. బ్రెయిన్ డబుల్ షార్ప్ అవుతుందట !

Air Fryer: ఎయిర్ ఫ్రైయర్ వంటలు ఆరోగ్యానికి ఇంత మంచివా? అస్సలు ఊహించి ఉండరు!

Alcohol: విస్కీ, వైన్, బీర్, కల్లు.. వీటిలో ఏది ఎక్కువ డేంజర్!

Symptoms In Legs: కాళ్లలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా ? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు !

Anti Aging Tips: వయస్సు పెరుగుతున్నా.. యవ్వనంగా కనిపించాలంటే ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో మాంసాహారం.. అక్కడి హిందువుల ప్రత్యేక వంటకం

Weight Gain Fast: ఈ ఫుడ్ తింటే.. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరగొచ్చు !

Spirulina Powder for Hair: డైలీ ఒక్క స్పూన్ ఇది తింటే చాలు.. ఊడిన చోటే కొత్త జుట్టు. 100 % రిజల్ట్ !

Big Stories

×