Cool Drinks Effect: వేసవికాలం వచ్చిందంటే చాలు చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు.. ఈ వేడి ఎండల్లో కూల్ డ్రింక్స్ తాగడం అంత మంచిది కాదు. అవి మీ ఆరోగ్యానికి హానికరంగా ఉంటాయి. అందుకు వేడిలో తగినంత నీరు, పండ్ల రసాలు, ఇతర సహజ పానీయాలు తాగడం మంచిదంటున్నారు.
అనారోగ్య సమస్యలు..
ఎండాకాలంలో చాలా ఇళ్లలో కూల్ డ్రింక్స్ ఏరులై పారుతాయి. చిన్న పిల్లల మెుదలుకొని పెద్దల వరకు వీటిని ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. . ఎండ తీవ్రత పెరిగిపోతున్న కొద్దీ ప్రజలు వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఎక్కువగా కూల్ డ్రింక్‌లను తాగడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కూల్ డ్రింక్స్‌లో అధికంగా షుగర్, కెఫైన్, కృత్రిమ రంగులు, రుచులను కలిగి ఉంటాయి, ఇవి మీ ఆరోగ్యానికి హానికరంగా ఉంటాయి. వీటిని తాగడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అందులోని కెఫైన్ నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు కూడా వస్తాయి.
మంచి పానీయాలు..
వేడి నుంచి తట్టుకోవాలంటే నీరు తగినంతగా తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అలాగే నిమ్మరసం, కొబ్బరి నీరు, పుచ్చకాయ రసం, క్యారెట్ రసం, దోసకాయ రసం వంటి సహజ పానీయాలు తాగడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఇవే కాకుండా లస్సీ, మజ్జిగ, చామంతి రసం, పుదీనా రసం, తదితర పానీయాలు కూడా వేడి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుందని వైద్యుల తెలిపారు.
Also Read: పిల్లలకు రూల్స్ కాదు.. ఈ కండిషన్స్ అలవాట్లు చేస్తే ఎంతో బుద్దిగా పెరుగుతారు..
వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వేసవిలో ఎక్కువగా బయట తిరగకుండా, అవసరమైతే బయటకు వెల్లకుండా ఉండటం చాలా మంచిది. ఏదైనా పనులు ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాలి అనుకుంటే పొద్దున, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లడం మంచిది. ఈ సీజన్ లో తేలికగా, మెత్తగా ఉండే దుస్తులను ధరంచడం వల్ల శరీరానికి అనుకులంగా ఉంటుంది. అలాగే తగినంత నీరు తాగుతు, పండ్ల రసాలు, ఇతర సహజ పానీయాలను తీసుకోండి.. వేడిలో ఎక్కువసేపు ఉండకుండా వాతావరణం చల్లగా ఉండే చెట్ల కింద అలా చల్లని ప్రదేశాల్లో ఉండడం చలా మంచదని సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.