Shaheen Afridi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. అయితే ఈ టోర్నమెంటులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఎలాంటి వరల్డ్ క్లాసు బౌలర్ అయిన వదలడం లేదు. సిక్సర్లు లేదా బౌండరీలతో రెచ్చిపోతున్నాడు వైభవ్. అయితే అలాంటి 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ పై ( Vaibhav Suryavanshi ) పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కారు కూతలు పూస్తున్నారు. అతని వయసు, వాడే బ్యాట్లపై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో వైభవ్ సూర్యవంశీని కించపరుస్తూ పాకిస్తాన్ ప్రీమియం బౌలర్ షాహీన్ అఫ్రిది ( Shaheen Afridi) కూడా రెచ్చిపోయి మాట్లాడారు. వాడు నా ముందు పిల్ల బచ్చాగాడు అంటూ కామెంట్స్ చేశారు. తన తొలి బంతికే వైభవ్ సూర్య వంశీ వికెట్ తీస్తానని హెచ్చరించారు.
15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) అదరగొడుతున్న నేపథ్యంలో షాహీన్ అఫ్రిది ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ తన ముందు ఇప్పటికీ కూడా చిన్న పిల్లాడేనని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ప్లేయర్లను ఇప్పటివరకు వైభవ్ సూర్య వంశీ ఎదుర్కోలేదు.. కానీ ఫేస్ చేస్తే మాత్రం అతడు డకౌట్ కావడం గ్యారెంటీ అని హెచ్చరించారు. తన బౌలింగ్లో అయితే మొదటి బంతికే వికెట్ తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటివరకు ఐపిఎల్ టోర్నమెంటులో చిన్న స్థాయి బౌలర్లను మాత్రమే వైభవ్ సూర్య వంశీ ఎదుర్కొన్నాడని షాకింగ్ కామెంట్స్ చేశారు షాహీన్ అఫ్రిది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటు నేపథ్యంలో వైభవ్ సూర్యవంశం ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడాడు. ఇందులో 579 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ గెలుచుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 44.54 యావరేజ్ తో 236 స్ట్రైక్ రేట్ సాధిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. బూమ్రా, భువనేశ్వర్ కుమార్, హెజెల్ వుడ్, కమిన్స్, లాంటి బౌలర్లకు ఇప్పటికే చుక్కలు చూపించారు. వీళ్ళు వేసిన ప్రతి తొలి బంతికి సిక్సర్ లేదా బౌండరీ కొట్టాడు వైభవ్. అలాంటి వైభవ్ ను ఉద్దేశించి షాహీన్ అఫ్రిది ఔట్ చేస్తానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. పాకిస్తాన్ వెధవలకు ఎప్పుడు ఇండియాపై ఏడవడం తప్ప ఆడటం చేతకాదని ఫైర్ అవుతున్నారు. మొన్న బంగ్లాదేశ్ పైన దారుణంగా ఓడిపోయిన కూడా సిగ్గు రావడంలేదని చురకలు అంటిస్తున్నారు.