Odisha: రీల్ సంఘటనలు కొన్ని రియల్‌గా జరుగుతున్నాయి. కొన్ని సన్నివేశాలైతే సినిమాలను తలపిస్తాయి. దేనికైనా హద్దు పద్దూ ఉంటుంది. తీవ్రరూపం దాల్చితే దాని పరిణామాలు అస్సలు ఊహించలేము. అదే చేశారు ఒడిషాలోని ఆరుగురు మహిళలు. అరవై ఏళ్ల కామాంధుడ్ని సీక్రెట్‌గా చంపేసి, ఆ మృతదేహాన్ని అడవుల్లో తగులబెట్టారు. ఇంతకీ అసలు విషయం ఏంటో తెలుసా?
ఒడిశాలోని గజపతి జిల్లాలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు చెప్పిన వివరాలు మేరకు.. 60 ఏళ్ల ముసలోడి భార్య నాలుగేళ్ల కిందట చనిపోయింది. ఒంటరిగా ఉన్న ఆ వ్యక్తి ఏ పని పాటు లేకుండా కాలం గడిపేస్తున్నాడు.
అదే సమయంలో ఆయన మనసు కామంపై మళ్లింది. ఆ గ్రామంలో పలువురు మహిళలపై కన్నేశాడు. ఆ తర్వాత వారిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. రోజు రోజుకూ వీడి టార్చర్ పెరిగి పోవడంతో ఆ మహిళలు తట్టుకోలేకపోయారు. జూన్ 3న 52 ఏళ్ల వితంతువుపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
వీడ్ని చంపితేనే తమకు విముక్తి కలగదని భావించారు. ఆపై లేపేయాలని స్కెచ్ వేశారు ఆరుగురు బాధితులు. ఇంట్లో ఒంటరిగా పెద్దాయన నిద్రిస్తున్న సమయంలో అతడిపై దాడి చేసి చంపేశారు ఆ మహిళలు. దాడి సమయంలో వారికి మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు సహకరించారు. మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతానికి తరలించి కాల్చేశారు.
ALSO READ: మరో హనీమూన్ జంట మాయం.. ఈసారి మరింత దారుణం
రోజులు గడుస్తున్నా పెద్దాయన జాడ తెలియలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అప్పుడు ముసలోడు హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఆరుగురు మహిళలతోపాటు సహకరించిన మరో నలుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జరిగిన విషయాలను పోలీసుల ముందు బయటపెట్టారు.
తమను లైంగికంగా వేధించినందుకే అతడ్ని చింపేసినట్టు వెల్లడించారు. పెద్దాయన వేధింపులపై ఏనాడు ఆ మహిళలు పోలీసుల సహాయం కోరలేదు. మృతుడిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని గజపతి పోలీసు సూపరింటెండెంట్ జతీంద్ర కుమార్ పాండా తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృత కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.