Parking : పార్కింగ్ అనేది సిటీలో ఉండే అతిపెద్ద సమస్యల్లో ఒకటి. అయితే దీనికోసం గొడవలు జరగడం అన్నది సర్వసాధారణ విషయం. కానీ పార్కింగ్ గొడవల కోసం ప్రాణాలు తీస్తారా ? అంటే అవుననే చెప్పాలేమో. రీసెంట్ గా ఇలాంటి సంఘటనే ఒకటి హైదరాబాద్ లో జరిగింది. అది కూడా అచ్చం ఓ తమిళ సినిమా తరహాలో జరగడం గమనార్హం. ఇంతకీ ఆ గొడవ ఏంటి? ఏ సినిమా స్టైల్ లో ఇదంతా జరిగింది? అనే విషయం తెలుసుకుందాం పదండి.
అసలేం జరిగిందంటే ?
హైదరాబాద్ లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కొత్తపేట్ లో ఉన్న వైష్ణవి రుక్త అపార్ట్మెంట్ లో ఈ ఘటన జరిగింది. కార్ పార్కింగ్ కోసం జరిగిన గొడవలో ఏకంగా ఓ వ్యక్తి ప్రాణాలను తీశారు. గత నెల 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటికే ఇదే స్టైల్ లో వచ్చిన ఓ తమిళ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
పార్కింగ్ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే? ఇలాంటి పార్కింగ్ సమస్యను ముందే ఊహించినట్టు ఉన్నారు తమిళ డైరెక్టర్ రామ్ కుమార్ బాలకృష్ణన్. 2023లో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పార్కింగ్. సిటీలో పార్కింగ్ సమస్య అనే స్టోరీ లైన్ తో ఈ మూవీని రూపొందించారు. సినిమాలో ఈశ్వర్ అనే ఐటీ ఎంప్లాయ్ కొత్తగా ఓ అపార్ట్మెంట్ లోకి ఫ్యామిలీతో దిగుతాడు. అతని భార్య ప్రెగ్నెంట్ గా ఉంటుంది. అయితే ఆ అపార్ట్మెంట్ లో అప్పటికే ఉంటున్న ఓ సీనియర్ కపుల్ తో పార్కింగ్ విషయమై ఈ జంటకు గొడవ మొదలవుతుంది. కారు అద్దాలు పగలగొట్టడడంతో, ఆ గొడవ కాస్తా పెద్ద యుద్ధంగా మారుతుంది.
ఓ వైపు ప్రెగ్నెంట్ భార్యను చూసుకుంటూ, మరో వైపు పార్కింగ్ కోసం విసిగించే సీనియర్ సిటిజెన్ తో విసిగిపోతుంటాడు ఈశ్వర్. ఓ సమయంలో ఆ ఇంటిని ఖాళీ చేయాలనుకుంటాడు ఈశ్వర్. భార్య ప్రెగ్నెంట్ కావడంతో అతను అక్కడే ఉండాల్సి వస్తుంది. అయితే ఈ గొడవ చివరికి మనుషులను చంపుకునే వరకూ వెళ్తుంది. క్లైమాక్స్ లో ఈ స్టోరీ ఊహించని మలుపు తిరుగుతుంది. మరి చివరికి ఆ పార్కింగ్ సమస్య ఎలాంటి గొడవకు దారి తీసింది? చివరికి ఏమైంది ? అనేది ఈ ‘పార్కింగ్’ మూవీ స్టోరీ. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : బెంగళూరు ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ.. ఏడుగురు యువతులతోపాటు ఐటీ నిపుణులు