BigTV English

Ameer Khan: చచ్చిపోవాలని ఉంది… బాంబు పేల్చిన స్టార్ హీరో … అదే చివరి సినిమా అంటూ!

Ameer Khan: చచ్చిపోవాలని ఉంది… బాంబు పేల్చిన స్టార్ హీరో … అదే చివరి సినిమా అంటూ!

Ameer Khan: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన వారిలో మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్(Ameer Khan) ఒకరు. సినిమా ఇండస్ట్రీలో ఈయన చేయని ప్రయోగం అంటూ ఏదీ లేదు. నిత్యం విభిన్న కథా చిత్రాల ద్వారా సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన విజయాలను తన సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ కూడా అమీర్ ఖాన్ సినిమా అంటే ఆయన సినిమాలలో ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు తన సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగానే అమీర్ ఖాన్ సినిమాలు కూడా ఉంటాయని చెప్పాలి.


సినిమా చేస్తూ చచ్చిపోవాలని ఉంది…

ఇక ఆమీర్ ఖాన్ త్వ‌ర‌లో ‘సీతారే జమీన్ పర్’ (Sitaare Zameen Par) అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం(Mahabaratham) గురించి ఇప్పటికే ఎన్నో విషయాలను వెల్లడించారు. తాజాగా ఈ సినిమా గురించి అమీర్ ఖాన్ షాకింగ్ విషయాలను తెలిపారు. ఈ సినిమానే నా చివరి సినిమా కావచ్చు అంటూ ఈయన బాంబు పేల్చడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ లో ఉండిపోయారు.


మహాభారతం నా కల…

మహాభారతం అనేది నా చిన్నప్పటి కల, మహాభారతంలో ప్రపంచంలో ఉన్న అన్ని భావోద్వేగాలు, మానవ సంబంధాలు కనిపిస్తాయి. అందుకే మహాభారతాన్ని నేను ఒక గొప్ప సినిమాగా చూపించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఒక గొప్ప సినిమా నా సినీ కెరియర్ లోనే ఆఖరి చిత్రం కావచ్చు అని కూడా అమీర్ ఖాన్ తెలియజేశారు. మహాభారతం లాంటి ఒక గొప్ప సినిమాని చేసిన తర్వాత తదుపరి ఎలాంటి సినిమా చేయాలో అర్థం కాని పరిస్థితి నాది అని, ఇలాంటి ఒక గొప్ప సినిమా చేస్తూ చనిపోవాలని ఉందని అమీర్ ఖాన్ తెలిపారు.

తన కెరియర్ గురించి అమీర్ ఖాన్ ఈ విధంగా చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మీరు ఈ సినిమాతోనే రిటైర్మెంట్ ప్రకటించకూడదని, మీ నుంచి ఎన్నో సరికొత్త చిత్రాలు రావాలని కోరుకుంటున్నాము అంటూ అభిమానులు ఈయన వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. ఇక అమీర్ ఖాన్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన “హ్యాపీ పటేల్”, “చార్ దిన్ కీ చాందనీ”, “జోయా అక్తర్” సినిమాలో కూడా న‌టిస్తున్నారు. వీటితోపాటు తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం కోసం కూడా పనిచేస్తున్నారు. అమీర్ ఖాన్ మహాభారతం సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు హీరోలు కూడా నటించబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా మహాభారతం సినిమా చేయటమే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పలు సందర్భాలలో వెల్లడించారు. జక్కన్న కంటే ముందుగానే అమీర్ ఖాన్ రంగంలోకి దిగడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×