BigTV English

Cheer Girls : చీర్ గర్ల్స్ ను వేధించిన అభిమాని.. రంగంలోకి పోలీసులు

Cheer Girls : చీర్ గర్ల్స్ ను వేధించిన అభిమాని.. రంగంలోకి పోలీసులు

Cheer Girls: సాధారణంగా ఐపీఎల్ లో చీర్ గర్ల్స్ ప్రత్యేకత గురించి దాదాపు అందరికీ తెలిసిందే. వారికి సెపరేట్ గా సెక్యూరిటీ కూడా ఉంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా టోర్నమెంట్ చివరి స్టేజీ కి రావడంతో ప్లే ఆప్స్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్,  పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ లీగ్ కి టాప్ ప్లేయర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే.. వారికంటే ఎక్కువగా చీర్ లీడర్స్ తమ డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. తమ జట్టు ప్లేయర్స్ ఫోర్, సిక్స్ కొట్టినా వికెట్ తీసినా అభిమానులతో పాటు చీర్ లీడర్స్ తమ టీమ్ ను ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ చీర్ లీడర్స్ కి జీతం ఎంత ఉంటుందని అనుకునేరు.. చాలా మంది వీరి సాలరీ లక్షల్లో ఉంటుందని ఊహిస్తారు. కానీ ఐపీఎల్ చీర్ గర్ల్స్ సాలరీ అనేది ఫ్రాంచైజీలని బట్టి ఉంటుంది.


Also Read :  Rinku Singh Wedding: ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న రింకూ సింగ్.. డేట్ ఫిక్స్..ప్రియా సరోజ్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

అయితే తాజాగా చీర్ గర్ల్స్ ను వేధించాడు ఓ అభిమాని.. దీంతో  పోలీసులు రంగంలోకి దిగారు. ఐపీఎల్ లో గతంలో  చెన్నై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ లో జరిగినట్లు ఆ జెండాలు చూస్తుంటే కనిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు తమ చీర్ లీడర్స్‌కి ఒక్కో మ్యాచ్‌కు రూ. 12 వేలు ఇస్తాయి. ఇక ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలు చీర్ గర్ల్స్‌కి ఒక్కో మ్యాచ్‌కు రూ. 20 వేల శాలరీ ఇస్తాయి. అన్ని ఫ్రాంచైజీల కంటే చీర్ లీడర్స్‌కి ఎక్కువ శాలరీ కోల్‌కతా నైట్ రైడర్స్ ఇస్తుంది. వీరు ఒక్కో మ్యాచ్‌కు చీర్ లీడర్స్‌కి రూ. 24 వేలు చెల్లిస్తుంది. ఇలా సీజన్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఒక్కో చీర్ గర్ల్‌కి రూ. 2 లక్షల వరకు శాలరీ వస్తుంది.  అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీలు చీర్ గర్ల్స్‌ను నేరుగా ఎంపిక చేయవు. వీరి ఎంపిక ఏజెన్సీల ద్వారా జరుగుతుంది.


ఇక ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటికే ఫైనల్ కి వెళ్లింది. ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతాయి. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. జూన్ 03న అహ్మదాబాద్ వేదిక గా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ సారి ఫైనల్ మ్యాచ్ లో ఓ జట్టు విజయం సాధిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇవాళ విజయం సాధిస్తే.. ముంబై ట్రోఫీ గెలుస్తుందని అభిమానులు పేర్కొంటే.. కాదు.. కాదు.. ఆర్సీబీ నే ట్రోఫీ గెలుస్తుందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు పేర్కొంటున్నారు. మొత్తానికి ఈ సీజన్ లో చీర్ గర్ల్స్ హైలెట్ గా మారారు.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×