Kotha Gudem News: కాసేపట్లో పెళ్లి.. మాంగళ్యం తంతునా మీనా అని పంతులు చెప్పడానికి కేవలం కొద్ది క్షణాలు మాత్రమే మిగిలాయి. ఈలోగా ఓ ఉపాధ్యాయుడు ఆ పెళ్లి మండపంలో ప్రత్యక్ష మయ్యాడు. పెళ్లి ఆపాలంటూ కోరాడు. తాను వధువును ఇష్టపడ్డానని చెప్పాడు. ఆపై గందరగోళం క్రియేట్ చేశారు. ఆ సమయంలో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ ఘటన కొత్త గూడెం జిల్లా పాల్వంచలో జరిగింది.
అసలేం జరిగింది?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన 29 ఏళ్ల యువతికి ఐదేళ్ల కిందట పెళ్లి జరిగింది. ఆమెకు ఓ పాప ఉంది. ఆ తర్వాత భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. చివరకు భర్తతో విసిగిపోయిన ఆమె విడాకులు తీసుకుంది. ప్రస్తుతానికి ఆమె ఓ ప్రైవేటు స్కూల్లో పని చేస్తోంది.
ఖమ్మంలో పని చేస్తున్న 33 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడి పెళ్లయిన కొన్నాళ్లకే భార్య చనిపోయింది. చివరకు తల్లిదండ్రులు మరో సంబంధం చూశారు. ఆమె పాల్వంచకు చెందిన ఆ మహిళ. ఇరువురుకి సెకండ్ మ్యారేజ్ కావడంతో పెద్దలు సైతం అంగీకరించారు. శనివారం పాల్వంచలోని ఓ ప్రార్థనా మందిరంలో పెళ్లి వేడుక మొదలైంది. ఇంతవరకు బాగానే జరిగింది.
మరో టీచర్ హంగమా
కాసేపట్లో ఇరువురు ఒక్కటి కానున్నారు. మరో మరో ప్రభుత్వం టీచర్ లైన్‌లోకి వచ్చాడు. ప్రైవేటు స్కూల్లో పని చేసినప్పుడు వధువుతో తనకు పరిచయం ఉందన్నాడు. తనకు పెళ్లయినా పిల్లలు పుట్టలేదని, భార్యకు విడాకులిచ్చి ఈమెను పెళ్లి చేసుకుంటానని రభస చేశాడు. జరుగుతున్న తతంగాన్ని ఇరుకుటుంబాల వారు చూస్తూ ఉండిపోయారు.
ALSO READ: చిచ్చు పెట్టిన సిగరెట్టు, ఆపై టెక్కీ మర్డర్
పెళ్లి చేసుకుందామని గతంలో రిక్వెస్టు చేశానని, తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకుంటానని వధువు స్పష్టం చేసిందని అన్నాడు. దాన్ని మనసులో పెట్టుకుని మహిళపై రివేంజ్‌కు ప్లాన్ చేశాడు. మహిళతో వివాహేతర సంబంధమున్నట్లు వరుడికి ఫోన్ చేశాడు. చివరకు పెళ్లి సమయానికి గోల చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. బంధువులు పట్టుకునే లోపు అక్కడి నుంచి ప్రభుత్వ టీచర్ పారిపోయాడు.
టీచర్ రచ్చ కారణంగా వరుడితోపాటు అతడి బంధువులు వెళ్లిపోయారు. దీంతో ఆ మహిళ వివాహం మధ్యలో ఆగిపోయింది. ఇష్టం లేదన్న కారణంతో తనపై కక్ష పెంచుకున్నాడని మహిళ బంధువులు అన్నారు. చివరకు తనపై రివేంజ్ తీర్చుకోవడానికి పెళ్లి చెడగొట్టాడని వాపోయింది ఆ మహిళ. ఈ నేపథ్యంలో బాధిత మహిళ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.