Bangalore Crime News: బెంగళూరులో జరిగిన హింసాత్మక హిట్ అండ్ రన్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీని వెనుక అసలు కారణం సిగరెట్ అని తేల్చేశారు పోలీసులు. ఈ ఘటనలో ఓ సాప్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందారు. ఇంతకీ అసలేం జరిగింది? ఎందుకు టెక్కీ బలయ్యాడు. ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్దాం.
హిట్ అండ్ రన్ ఘటనలో 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మరణించాడు. అతడి స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన వెనుక సిగరెట్ అసలు వివాదానికి కారణమైంది. బెంగుళూరులో సాప్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు సంజయ్-కార్తీక్‌లు. శనివారం వీకెండ్ కావడంతో వీరిద్దరు బైక్ సిటీలో చక్కర్లు కొట్టారు. పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తూ ఎంజాయ్ చేశారు.
కాస్త రిలాక్స్ కోసం చిన్న పాన్ షాప్ వద్ద వీరిద్దరు ఆగారు. అదే సమయంలో ఆ పాన్ షాపు వద్దకు హ్యుందాయ్ క్రెటా కారు వచ్చి ఆగింది. అందులో భార్యతో కలిసి వచ్చిన వ్యక్తి ప్రతీక్, కారు దిగకుండానే తన సిగరెట్ అందించాలని టెక్కీ సంజయ్‌ని కోరాడు. దీంతో మండిపోయిన సంజయ్, కారులో ఉన్న వ్యక్తిపై రుసరుసలాడాడు.
కారులో ఉన్న వ్యక్తి ప్రతీక్ లోపలి నుంచి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడితో ఆ గొడవ ముగిసిపోయింది. తనను నానా మాటలు అన్నాడని కోపంతో రగిలిపోయాడు ప్రతీక్. వీడికి ఎలాగైనా బుద్ది చెప్పాలని భావించాడు.
ALSO READ: అదుపు తప్పి బావిలో పడిన కారు, స్పాట్‌లో ముగ్గురు మృతి
ఘటన తర్వాత సంజయ్-కార్తీక్ ఇద్దరు బైక్‌పై వెళ్తున్నారు. వారిని ఫాలో అయ్యాడు కారులోని ప్రతీక్. వెనుక నుంచి వేగంగా వచ్చి కారుతో బైక్‌ని బలంగా ఢీ కొట్టాడు. ఈప్రమాదంలో సంజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన కార్తీక్‌ను వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
స్థానికులు సహాయంలో నిందితుడు ప్రతీక్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన మే 10 శనివారం తెల్లవారుజామున జరిగింది. ఘటనకు సంబంధించి CCTV ఫుటేజ్‌లో మొత్తం రికార్డ్ అయ్యింది. దాని ప్రకారం ఈ కేసును హత్యగా నమోదు చేయడం, నిందితుడ్ని అరెస్ట్ చేయడం జరిగిపోయింది.