BigTV English
Advertisement

Eggs: రోజులో ఎన్ని ఎగ్స్ తినాలి ? అతిగా తింటే ఏం జరుగుతుంది ?

Eggs: రోజులో ఎన్ని ఎగ్స్ తినాలి ? అతిగా తింటే ఏం జరుగుతుంది ?

Eggs: గుడ్డు అనేది పోషకాలతో సమృద్ధిగా ఉండే ఆహార పదార్థం. ఇది ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాల వంటి పోషకాలతో సమృద్ధిగా నిండి ఉంటుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కొంతమంది గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివని ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ గుడ్లు అధికంగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరం.


ఇలాంటి పరిస్థితిలో.. ఒక రోజులో ఎన్ని గుడ్లు తినడం మన ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది ? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్డులోని పోషకాలు, ప్రయోజనాలు:


గుడ్డులో 6-7 గ్రాముల ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి12, కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇందులోని ప్రోటీన్ కండరాలను నిర్మించడానికి, మరమ్మత్తు చేయడానికి సహాయపడుతుంది. కోలిన్ మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం.

ఒకరు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి ?
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 1-2 గుడ్లు తినడం సురక్షితం, ప్రయోజనకరం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వంటి సంస్థలు కూడా ఇదే సిఫార్సు చేస్తున్నాయి. అయితే.. వ్యక్తి వయస్సు, శారీరక శ్రమ, ఆరోగ్య స్థితులను ఆధారంగా చేసుకుని గుడ్లు తినాలి. ఉదాహరణకు.. ఎక్కువ ప్రోటీన్ అవసరమయ్యే అథ్లెట్లు లేదా బాడీబిల్డర్లు, డైటీషియన్ సలహా మేరకు 3-4 గుడ్లు తినాలి.

గుడ్లు ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు:
గుడ్లు పోషకాలు కలిగి ఉన్నప్పటికీ వాటిని అధికంగా తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది (ఒక్కో గుడ్డుకు దాదాపు 186 మి.గ్రా). కొంత మందిలో ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. అంతే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఇప్పటికే గుండె సమస్యలతో బాధపడుతున్న వారు గుడ్లు తినకుండా ఉంటే మంచిది.

Also Read: బీట్ రూట్ ఇలా వాడితే.. చందమామ లాంటి ముఖం మీ సొంతం

జీర్ణవ్యవస్థ:
ఇది కాకుండా.. ఎక్కువ గుడ్లు తినడం వల్ల గ్యాస్ లేదా అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. కొంత మందికి గుడ్లు అంటే అలెర్జీ కూడా ఉంటుంది. అందుకే డాక్టర్లను సంప్రదించిన తర్వాతే గుడ్లు తినాలి. గుడ్లు తినడానికి అనేక ఆరోగ్యకరమైన మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఉడకబెట్టడం లేదా ఆమ్లెట్ లాగా తయారు చేసి తినడం.

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×