BigTV English

Warangal News: కేవలం అక్రమ సంబంధమే కాదు.. ప్రియుడితో భార్య ప్లాన్, కాకపోతే సీన్ రివర్స్

Warangal News: కేవలం అక్రమ సంబంధమే కాదు..  ప్రియుడితో భార్య ప్లాన్, కాకపోతే సీన్ రివర్స్


Warangal News: చేసిన పాపాలు ఫలితం ఒకప్పుడు ఆలస్యంగా వచ్చేది.  టెక్నాలజీ పుణ్యమాని ఇప్పుడు వెంట వెంటనే తెలిసిపోతోంది.  అందుకు ఎగ్జాంఫుల్ వరంగల్ సిటీలోని ఈ ఘటన. భర్తను చంపేందుకు ప్రియుడితో ప్లాన్ చేసింది. సుఫారీ గ్యాంగ్‌ని ఏర్పాటు చేసింది.  సంచనలం రేపిన ఈ ఘటన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలేం జరిగింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

వరంగల్‌ జిల్లా రామన్నపేటకు చెందిన రాజు-పద్మ భార్యభర్తలు.  వివాహం జరిగి చాన్నాళ్లు అయ్యింది. కష్టసుఖాలను ఒకరితో మరొకరు పంచుకునేవారు.  ఇంట్లో నుంచి గుట్టు బయటకు వచ్చేది కాదు. రాజు తాపీ మేస్త్రి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పద్మ ఇంటి వ్యవహారాలను చక్కబెట్టేది.


మూడేళ్ల కిందట కరీంనగర్‌ జిల్లాలోని మోత్కులగూడం గ్రామానికి చెందిన సందీప్‌తో రాజుకు పరిచయం ఏర్పడింది. డబ్బులు రావడంతో పొదుపు చేయాలని రాజు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సందీప్‌ వద్ద లక్ష రూపాయల చిట్టీ వేశాడు. రాజు-సందీప్‌కు క్లోజ్‌గా ఉండేవారు. ఈ క్రమంలో ఇంటికి తీసుకుని వెళ్లేవారు. ఇంతవరకు బాగానే జరిగింది.

సందీప్ కాస్త ఎర్రగా, బొద్దుగా ఉండడంతో పద్మ ఆలోచన మారింది. చివరకు సందీప్‌తో పద్మ పరిచయం క్రమంగా పెరిగింది. చివరకు వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్దిరోజుల తర్వాత ఇరుగుపొరుగు మాటలతో భార్యని రాజు హెచ్చరించాడు. చివరకు ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.

ALSO READ: ఏపీలో దారుణం.. పిల్లలను చంపి ఉరేసుకున్న తండ్రి

తమ ఏకాంతానికి భర్త అడ్డుపడుతున్నాడని పద్మ భావించింది. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తను చంపాలని డిసైడ్ అయ్యింది. చివరకు ప్రియుడితో కలిసి పక్కాగా స్కెచ్ వేసింది. ఈ నెల 14న సందీప్.. తన ముగ్గురి ఫ్రెండ్స్‌తో కలిసి రాజును చంపాలని భావించింది. మద్యం పార్టీకి నగర శివారులోని ఓ డంపింగ్‌యార్డుకు తీసుకెళ్లాడు.

మద్యం మత్తులో రాజుపై కర్రలతో దాడి చేశారు. స్పృహ కోల్పోవడంతో రాజు పడిపోయాడు. ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించారు. వెంటనే మెలుకువ వచ్చిన రాజు, గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. వెంటనే రాజుని ఆసుపత్రికి తరలించారు. వారి పేరెంట్స్‌కి సమాచారం ఇచ్చారు.

ఘటన జరిగినా భార్య రాకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే రాజు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన విషయాన్ని సందీప్.. వెంటనే తన ప్రియురాలు పద్మకు చెప్పాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పద్మ ఇంట్లో ఉన్న 9 లక్షలు తీసుకుని నిందితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చింది. ఆ తర్వాత సందీప్‌తో కలిసి కారులో పారిపోయింది పద్మ.

వరంగల్ సిటీలో హనుమాన్‌ జంక్షన్‌ వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో కారులో వెళ్తున్న పద్మ-సందీప్‌లు పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి దాదాపు ఐదున్నర లక్షలు, కారు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆసుపత్రిలో రాజు చికిత్స పొందుతున్నాడు.

Related News

Guntur News: రాష్ట్రంలో దారుణ ఘటన.. పిల్లలను చంపి ఉరేసుకున్న తండ్రి

Delhi News: దారుణం.. సొంత తల్లిపై అత్యాచారానికి పాల్పడిన కిరాతక కొడుకు.. చివరకు..?

Medak District Crime: కన్న కొడుకును చంపిన తల్లి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Khazana Jewellers Robbery: ఖజానా జ్యువెలరీ దోపిడీ దొంగలు ఇలా దొరికారు.. కీలక విషయాలు చెప్పిన డీసీపీ

Hyderabad crime: ఛీ.. ఛీ.. వీడు మనిషేనా? ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం..

Big Stories

×