Crime News: వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సంఘం మండలం తీగరాజుపల్లి వద్ద కారు అదుపు తప్పి ఎస్‌ఆర్ఎస్‌పీ కాలువలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. మరో వ్యక్తి స్థానికులు కాపాడారు.
ALSO READ: Kishan Reddy: తెలంగాణ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. RRRపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన
వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేషరాశి పల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు, వారి ఇద్దరి పిల్లలు కారులో వరంగల్ నగరం వైపు వెళుతున్నారు. అయితే వరంగల్ జిల్లా సంఘం మండలం తీగరాజు పల్లి బ్రిడ్జి పైన కారు అదుపు తప్పి ఎస్ఆర్ఎస్ పీ కెనాల్ లోకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతిచెందినట్టు తెలుస్తోంది. బాలుడి తల్లిని అక్కడున్న స్థానికులు కాపాడగా.. తండ్రి, కూతురు గల్లంతయ్యారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు చేపట్టారు. ఎస్ఆర్‌ఎస్‌పీ కాలువ లోంచి పోలీసులు కారును బయటకు తీశారు. తండ్రి ప్రవీణ్, కూతురు హర్షిణి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మృతదేహాలను ఆస్పత్రికి ఎంజీఏం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డ్రైవింగ్ టైంలో హార్ట్ స్ట్రోక్ గురి కావడంతో ప్రమాదం:
ఈ ఘటనలో పోలీసులు కీలక సమాచారం తెలిపారు. కారు డ్రైవింగ్ చేసే సమయంలో ప్రవీణ్, తన భార్యకు ఛాతీ నొప్పి వస్తుందని చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. ఛాతీ నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో కారు అదుపు తప్పి ఎస్ఎర్‌ఎస్‌పీ కాలువలో దూసుకెళ్లిందని తెలిపారు. ఆ ఘటనలో ప్రవీణ్, తన కూతురు హర్షిణి, కుమారుడు రెండెళ్ల బాలుడు మృతిచెందారు. ప్రవీణ్ భార్య ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
అదుపుతప్పి SRSP కాలువలోకి దూసుకెళ్లిన కారు
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతు
వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ఘటన
బాలుడు మృతి, కారుతో పాటు తండ్రి, కూతురు కూడా గల్లంతు
మహిళను కాపాడిన స్థానికులు pic.twitter.com/klTiS9HBtF
— BIG TV Breaking News (@bigtvtelugu) March 8, 2025