BigTV English

Cleaning Hacks: ఇలా చేస్తే.. క్షణాల్లోనే మీ ఇల్లు అందంగా మెరిసిపోతుంది !

Cleaning Hacks: ఇలా చేస్తే.. క్షణాల్లోనే మీ ఇల్లు అందంగా మెరిసిపోతుంది !

Cleaning Hacks: ఇంటిని శుభ్రపరచడం అనేది రోజు చేసే పనే. ఇంటిని శుభ్రంగా ఉంచడం అనేది చాలా ముఖ్యం. కానీ ఇంటిని శుభ్రపరిచేటప్పుడు కొన్ని తప్పులు లేదా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వీటి కారణంగా ఎంత సమయం కేటాయించినా కూడా పనులు పూర్తి అవ్వవు. లేదా ఇల్లు అందంగా కనిపించదు. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరి ఎలాంటి టిప్స్ పాటిస్తే.. ఇల్లు తళలళా మెరిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


ఇల్లు శుభ్రం చేయడానికి చిట్కాలు:

బాత్రూమ్ ఇంట్లో అత్యంత మురికిగా ఉండే ప్రదేశం. కాబట్టి బాత్రూమ్ నుండే ఇల్లును శుభ్రపరచడం ప్రారంభించండి. ఇంట్లోని ఇతర ప్రదేశాల కంటే బాత్రూమ్ శుభ్రం చేయడం చాలా కష్టం. అందుకే కష్టమైన పనులను ముందుగా చేయడం మంచిది. మీరు బాత్రూమ్ నుండి ఇల్లు క్లీన్ చేసే ప్రక్రియను ప్రారంభించి, మిగతా పనులను త్వరగా చేయవచ్చు.


సరైన వస్తువులు :
ఇల్లు శుభ్రం చేయడానికి మంచి బ్రష్‌లతో పాటు క్లీనింగ్ ఐటమ్స్ ఉపయోగించండి. లేదంటే మీరు ఇల్లు శుభ్రం చేసేటప్పుడు మీకు ఎక్కువ సమయం పడుతుంది. అంతే కాకుండా మురికగా ఉన్న బ్రష్ లు లేదా ఇతర క్లీని్గ్ వస్తువులను వాడటం వల్ల ఇల్లంతా బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎల్లప్పుడూ శుభ్రమైన మాప్ , బ్రష్ లను ఉపయోగించాలి. మీ ఇంట్లో బ్యాక్టీరియా వ్యాపించ కూడదనుకుంటే.. ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.

పనిలో తోడు:
ఇంటిని ఒంటరిగా శుభ్రం చేయడానికి బదులుగా, కుటుంబ సభ్యులందరితో కలిసి చేయండి. ఇలా చేయడం వల్ల వేగంగా పని పూర్తి చేయడానికి వీలవుతుంది. అంతే కాకుండా మీరు ఎక్కువగా అలసిపోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది.

వస్తువులు :
శుభ్రం చేయడానికి సరైన వస్తువులను ఉపయోగించండి. ఇంట్లో వాడే డిటర్జెంట్, శానిటైజర్, క్రిమిసంహారక మందులను కొనుగోలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు వహించండి . మురికిని తొలగించే లేవదా మీ పనులను సులభతరం చేసే వాటినే మీరు కొనడం మంచిది.

తలుపులు, కిటికీలను శుభ్రపరచడం:
చాలా మంది తలుపులు, కిటికీలను క్లీన్ చేయకుండా ఉంటారు. కానీ ఈ ప్రదేశాలు ఎక్కువగా దుమ్ము, ధూళితో నిండి ఉంటాయి. వీటిని రోజూ శుభ్రం చేయాలి. కిటికీ అద్దాలను శుభ్రం చేయడానికి, తడి గుడ్డ.. తలుపులను తుడవడానికి గ్లాస్ క్లీనర్ ఉపయోగించండి. తరచుగా క్లీన్ చేయడం వల్ల కిటికీలపై ఉన్న మురికి తొలగిపోతుంది. అంతే కాకుండా తెల్లగా మెరిసిపోతాయి.

టైల్స్, మెట్లను శుభ్రం చేయడం:
టైల్స్, ఫ్లోర్‌లను శుభ్రంగా మెరుస్తూ ఉంచడానికి డిటర్జెంట్ లేదా ఫ్లోర్ క్లీనర్‌ను ఉపయోగించండి. టైల్స్ పగుళ్లలో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడానికి పాత బ్రష్‌ను ఉపయోగించడం మంచిది. శుభ్రం చేసిన తర్వాత నేలను ఆరబెట్టడం మర్చి పోవద్దు. తద్వారా ఎవరూ జారిపోయే ప్రమాదం ఉండదు.

 ఉపరితలాలను శుభ్రపరచడం:
దుమ్ము పేరుకుపోయిన ఇంటి మూలలను శుభ్రం చేయడంపై శ్రద్ధ వహించండి.​ ఇంటి మూలలు , పైకప్పులను శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రదేశాలను శుభ్రం చేయడానికి చాలా మంది ఆసక్తి చూపరు. ఇక్కడ దుమ్ము , సాలెపురుగులు పేరుకుపోతాయి. ఈ ప్రాంతాలను శుభ్రం చేయడానికి పొడవాటి హ్యాండిల్ బ్రష్ లేదా వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించండి.

Also Read: ఈ హెయిర్ మాస్క్‌ ఒక్కసారి వాడినా చాలు.. జుట్టు పెరగడం గ్యారంటీ

వంటగది శుభ్రం చేయడం:
ఇంట్లో వంటగది కూడా ఎక్కువగా మురికిగా ఉండే ప్రదేశమే వంటగదిలో గ్యాస్ స్టవ్, సింక్ , అల్మారాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి. బాత్రూంలో టైల్స్, షవర్, ట్యాప్స్, సింక్ శుభ్రం చేయడానికి డిటర్జెంట్ లేదా బాత్రూమ్ క్లీనర్ ఉపయోగించి క్లీన్ చేయండి.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×