Memes on CT 2025 Final: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కీ కౌంట్ డౌన్ మొదలైంది. ఈ టోర్నీలో ఇక మిగిలింది ఒకే ఒక్క మ్యాచ్. మార్చ్ 9 ఆదివారం రోజున భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ జరగాల్సి ఉంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యం ఇస్తుంది పాకిస్తానే అయినా.. భారత్ మాత్రం తమ మ్యాచ్ లు అన్నింటిని దుబాయ్ వేదికగా ఆడుతుంది. ఈ మ్యాచ్ కోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది.
అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైనప్పటినుండి ఈ టోర్నీలో పాల్గొన్న ఇతర జట్లు టీమిండియాపై ఏడుస్తూనే ఉన్నాయి. ఒక్క ఆఫ్గనిస్తాన్ జట్టు మినహా.. ఈ టోర్నీలో పాల్గొన్న ఇతర జెట్లన్నీ.. భారత్ తన మ్యాచ్లు అన్నింటినీ దుబాయ్ వేదికగానే ఆడుతూ ఉండడం వల్ల ఆ జట్టుకు మిగతా జట్లకంటే అదనపు ప్రయోజనం కలుగుతుందని భారత జట్టుపై ఏడుస్తూనే ఉన్నాయి. అయితే ఒకరి బాగు కోసం ఆలోచిస్తే అది మనకు మంచే జరుగుతుంది.. అదే ఒకరికి చెడు జరగాలని తలచితే.. మనకు కూడా అదే జరుగుతుందని పెద్దలు అంటుంటారు.
ఈర్ష, అసూయతో కుట్ర పన్నితే ఫలితం అనుభవించక తప్పదని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ఇప్పుడు ఈ టోర్నీలో పాల్గొన్న ఇతర జట్లు భారత జట్టుపై ఈర్ష, అసూయతో.. భారత జట్టుపై చేస్తున్న వ్యాఖ్యల పట్ల.. ఈ వ్యాఖ్యలు ఇతర జట్లకు సూట్ అవుతాయని అంటున్నారు భారత క్రీడాభిమానులు. భారత జట్టు ఈ టోర్నీలో ఒకే గ్రౌండ్లో ఆడడం వల్ల ప్రయాణ భారం లేకపోవడం, పిచ్ తో పాటు కండిషన్స్ కి ఈజీగా అలవాటు పడడం టీమిండియాకు అనుకూలం అంటూ భారత జట్టుపై విమర్శలు చేస్తున్నారు ఇతర జట్టులో ప్లేయర్స్.
అయితే ఈ వ్యాఖ్యలు సరికాదని అభిప్రాయపడుతున్నారు భరతమాజీ ఆటగాళ్లు, క్రీడాభిమానులు. తమ జట్టు పాకిస్తాన్ కి వెళ్లకుండా దుబాయ్ లోనే ఆడుతుందని ముందే నిర్ణయించారని, ఒకవేళ ఏదైనా దేశం భారత మ్యాచ్ లు, వేదికల గురించి అభ్యంతరం వ్యక్తం చేయాలని అనుకుంటే ముందే చేయాల్సింది, కానీ అంతా అయిపోయి ఇప్పుడు ఫైనల్ కీ చేరుకున్నాక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం సరైనది కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఒక్క ఆఫ్గానిస్తాన్ జట్టు తప్ప మిగతా జెట్లన్నీ టీమ్ ఇండియాకి వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో.. ఇందుకు సంబంధించిన నేమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజెన్లు. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో టైటిల్ గెలిచిన విజేతకు భారీగా డబ్బులు వచ్చి పడతాయి. ఈ టోర్నీలోని ఫైనల్ విజేత, రన్నరప్ జట్టుకు మొత్తం ప్రైజ్ మనీ రూ. 29.23 కోట్లు. అయితే ఇందులో గెలిచిన జట్టుకు 19.49 కోట్లు, ఓడిన జట్టుకు దాదాపు 9.74 కోట్లు.
ఇలా గెలిచిన, ఓడిన జట్ల మధ్య దాదాపు 10 కోట్ల అంతర్యం ఉంటుంది. ఇక ఇప్పటివరకు జరిగిన ఈ టోర్నీ మొత్తంలో భారత జట్టు ప్రదర్శనను పరిశీలిస్తే ఫైనల్ లో గెలుపు ఖాయం. అలాగే దుబాయిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత జట్టుకు మంచి రికార్డు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఫైనల్ లో న్యూజిలాండ్ పై భారత జట్టు విజయం సాధించడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు క్రీడాభిమానులు.
This is how the Champions Trophy 2025 final will unfold this time 🇮🇳🏆🇳🇿
Do you agree? Share your thoughts and let us know whom you're backing!👇👀#INDvNZ #Dubai #ChampionsTrophy #Sportskeeda pic.twitter.com/L7NVuSqIyn
— Sportskeeda (@Sportskeeda) March 8, 2025