BigTV English

Uttar Pradesh : గొయ్యిలో పడిన కారు.. ఆరుగురి మృతి

Uttar Pradesh : గొయ్యిలో పడిన కారు.. ఆరుగురి మృతి
Uttar Pradesh

Uttar Pradesh News today(Telugu news updates):


సోమవారం తెల్లవారుజామున యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్ దెహాత్ జిల్లాలోని సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జగన్నాథ్ పూర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వర్షం పడుతుండగా.. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి నీరు ఉన్న గొయ్యిలో పడింది. ప్రమాద సమయంలో కారులో ఉన్నవారిలో.. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో కారును బయటకు తీశారు. గాయపడిన చిన్నారులను స్థానిక ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ప్రస్తుతం వారిద్దరు చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఇంకా గుర్తించలేదని, వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.


Related News

Kerala Crime: కేరళలో మరో లవ్ జిహాదీ… వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Kukatpally News: ఎంత పని చేశావ్ దేవుడా..? షటిల్ ఆడుతుండగా కరెంట్ షాక్.. క్షణాల్లో బాలుడు మృతి

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Nagpur Tragedy: దారుణం.. భార్య శవాన్ని బైకుకు కట్టుకుని వెళ్లిన భర్త.. ఎందుకంటే?

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Big Stories

×