E-Paper
Advertisement

Adulterated Pickles: కుళ్లిన కూరగాయలతో 70 డ్రమ్ముల పచ్చళ్ళు.. అన్న తమ్ముడు అరెస్ట్..!

Adulterated Pickles: కుళ్లిన కూరగాయలతో 70 డ్రమ్ముల పచ్చళ్ళు.. అన్న తమ్ముడు అరెస్ట్..!
Advertisement

Adulterated Pickles: స్వేచ్ఛ బ్యూరో: కుళ్లిపోయిన కూరగాయలు.. నాణ్యత లేని వంట దినుసులతో పచ్చళ్లుత తయారు చేస్తున్న అన్నదమ్ములను కుల్సుంపురా పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుని నుంచి భారీ మొత్తంలో ఈ కల్తీ పచ్చళ్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్​ఐ నరసింహ బుధవారం సిబ్బందితో కలిసి గస్తీ చేస్తూ వెంకటేశ్వర కాలనీలోని ఓ గోడౌన్​ లో అనుమానాస్పద కార్యకలాపాలను గమనించారు. లోపలికి వెళ్లి తనిఖీ చేయగా జియాగూడకు చెందిన నరసింహ (54), నరేశ్ (45) కలిసి అక్కడ కుళ్లిపోయిన కూరగాయలు, నాసిరకం వంట దినుసులతో పచ్చళ్లు తయారు చేస్తున్నట్టు వెల్లడైంది.

Also Read: Inter Students in AP: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఏప్రిల్ ఒకటి నుంచి క్లాసులు ప్రారంభం

పచ్చళ్లు సీజ్..​

Advertisement

దాంతోపాటు పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో ఈ పని చేస్తున్నట్టు తేలింది. వీటిని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న కిరాణా దుకాణాలకు సప్లయ్​ చేస్తున్నట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో పోలీసులు గోడౌన్ నుంచి 72 డ్రమ్ముల నిమ్మకాయ, పండు మిర్చి, చింతకాయ, ఉసిరి, గోంగూర పచ్చళ్లను సీజ్​ చేశారు. దాంతోపాటు 6 డ్రమ్ముల టొమాటో, చింతపండు పేస్ట్​, ఓ డ్రమ్ము అల్లం వెల్లుల్లి పేస్ట్​, ఎలక్ట్రానిక్​ వేయింగ్​ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Action Thriller OTT: రెండు కుటుంబాల మధ్య దద్దరిల్లే గ్యాంగ్ వార్… ఓటీటీలో టాప్ రేటింగ్ తో ట్రెండింగ్

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×