E-Paper

మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. సుకుమార్ -రామ్ చరణ్ మూవీ లేనట్లేనా..?

మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. సుకుమార్ -రామ్ చరణ్ మూవీ లేనట్లేనా..?

Ram Charan : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రాలలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీ కూడా ఒకటి. ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. గతంలో రామ్ చరణ్ ఎన్నడు కనిపించని లుక్ లో ఈ సినిమాలో కనిపించడంతో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు.. ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా వస్తే బాగుండు అని అప్పట్లో అనుకున్నారు. అయితే సుకుమార్ కాంబినేషన్లో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే.. పెద్ది మూవీ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ తో సినిమా చెయ్యాల్సి ఉంది. అయితే ఇప్పుడు సినిమా షూటింగ్ లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది..

రామ్ చరణ్ కు సర్జరీ..

టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్గా పెద్ద మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుంది.. అయితే ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. సుకుమార్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ మూవీ త్వరలోనే ప్రారంభం కాబోతుంది అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు షూటింగ్ కి బ్రేక్ వచ్చినట్లు తెలుస్తుంది. దానికి కారణం రామ్ చరణ్ సర్జరీ అని తెలుస్తుంది. స్పోర్ట్స్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఆయనకు కొన్ని చిన్నపాటి గాయాలైనట్లు తెలుస్తోంది. వాటి వల్లే ఈ మూవీ ఆలస్యంగా సెట్స్ మీదకు వెళ్ళబోతుందని ఫిలింనగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.. ఈ సినిమా థియేటర్లలోకి రిలీజ్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ గ్యాప్ తీసుకోవడంతో వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ సినిమా గురించి అధికార ప్రకటన రాబోతుందని సమాచారం..

Also Read : వంటలక్కకు ఏమైంది?.. ఇలా చేస్తావనుకోలేదు.. ఫ్యాన్స్ కు షాక్..

‘పెద్ది’ కలెక్షన్స్ విషయానికొస్తే..

రామ్ చరణ్ బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ చిత్రం పెద్ది.. డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఏ మూవీ ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వసూల్ అవుతున్నాయి. గ్రామీణ క్రీడా నేపథ్య చిత్రం ‘పెద్ది’తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 400 కోట్ల వసూళ్లను ఈ సినిమా రాబట్టింది అని ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు. ఈ వీకెండ్ కలెక్షన్స్ ఇంకాస్త పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం.. మరి పెద్ది మూవీ 1000 కోట్ల క్లబ్ లోకి చేరుతుందేమో చూడాలి.. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కూడా భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది.. మరి ఇందులో చరణ్ ను సుకుమార్ ఎలా చూపిస్తాడో అన్నది ఆసక్తిగా మారింది.

Related News

భార్యతో కలిసిపోయిన సీఏం విజయ్.. ఆమె ఎంట్రీతో విడాకులు క్యాన్సిల్..!

‘గాడ్ ఆఫ్ వార్’ తో ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్కెచ్.. కోలీవుడ్ డైరెక్టర్‌కు నో ఛాన్స్?

కొత్త మలుపు రివ్యూ: సింగర్ సునీత కొడుకు హిట్ కొట్టాడా? సినిమా ఎలా ఉందంటే?

విజయ్ ‘టీవీకే’ టార్గెట్‌గా చిన్మయి సంచలన పోస్ట్.. దళపతికి ఊహించని షాక్!

ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్.. రెండు రోజుల్లో మీడియా ముందుకు ..అసలు కథ ఏంటంటే?

మ్యూజిక్ డైరెక్టర్‌ను ఇసుకలో పాతిపెట్టిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. షాకింగ్ వీడియో వైరల్!

రామ్ చరణ్ ‘పెద్ది’ 500 కోట్ల మార్కును అందుకోవడం కష్టమేనా?

×