BigTV English

Flight Charges : ఆ రూట్లల్లో ఆకాశాన్ని తాకుతున్న విమాన ప్రయాణ టికెట్లు.. ఏకంగా ఎంపీలే ఆందోళనకు దిగిన వైనం..

Flight Charges : ఆ రూట్లల్లో ఆకాశాన్ని తాకుతున్న విమాన ప్రయాణ టికెట్లు.. ఏకంగా ఎంపీలే ఆందోళనకు దిగిన వైనం..

Flight Charges : హైదరాబాద్ నుంచి ఆయోధ్యకు విమానంలో వెళ్లాలంటే ఇప్పుడు టికెట్ ధర రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఉన్నాయి. అదే కుంభమేళ జరుగుతున్న వారణాసికి వెళ్లాలంటే మాత్రం రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు చెల్లించాల్సిందే. ఈ రెండు రూట్లలోనే కాదు. దేశంలోని చాలా రూట్లల్లో ఇదే పరిస్థితి. ఇంత భారీ స్థాయిలో కాకపోయినా.. సాధారణం కంటే చాలా ఎక్కువగానే టికెట్ ధరలు విక్రయిస్తున్నారు. ఇదే అంశాన్ని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందుకు వెళ్లారు. దేశంలో విమాన టికెట్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా చేస్తున్న పరిస్థితులపై చర్చించారు.


విమానయాన సంస్థలపై ఎలాంటి నియంత్రణలు లేకపోవడంతో.. ప్రైవేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా టికెట్లు విక్రయిస్తున్నాయని ఆరోపించారు. ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు జవాబుదారీతనంతో వ్యవహరించాలని పలువురు ఎంపీలు బుధవారం నాడు పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) సమావేశంలో కోరారు. ప్రభుత్వ సంస్థలు, రెగ్యులేటరీలు ధరల్ని నియంత్రించకపోవడంతో.. విమాన టికెట్లు ఆకాశాన్ని తాకుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఓ విధానం అంటూ లేకుండా పోతున్న ఈ విధానంపై ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు.

పార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ చైర్‌పర్సన్ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్‌ఏ) సక్రమంగా వ్యవహరించడం లేదంటూ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు రెగ్యులేటరీ నియంత్రణ మండలి తగిన సమాధానం చెప్పలేదని సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. విమానయాన ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయని.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఎ)/ పౌర విమానయాన శాఖ నుంచి ఎటువంటి చర్యలు లేవని ఆగ్రహించారు. సామాన్యులకు విమాన టికెట్లు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన ఎంపీలు.. ధరల విషయంలో ప్రైవేటు విమానాశ్రయాల నిర్వాహకులు, విమాన సర్వీసుల నిర్వాహకులను బాధ్యులను చేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.


ఈ విషయంలో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల ఎంపీలు విమాన టికెట్ల విషయంలో అసంతృప్తిగా ఉన్నారంటూ పీఏసీ ఛైర్ పర్సన్ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ సమావేశంలో పీఏసీ సభ్యులతో పాటు పౌరవిమానయాన శాఖ కార్యదర్శి, ఏఈఆర్‌ఏ ఛైర్‌పర్సన్‌ కూడా పాల్గొన్నట్లు వెల్లడించారు. ఛార్జీల పెంపును పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరం ఉందని ఎంపీలు అభిప్రాయపడ్డారు. టికెట్ ధరల విషయంలో మరింత జవాబుదారీతనం, పారదర్శకత అవసరమన్నారు. అలాగే.. రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచేందుకు AERA చట్టానికి సవరణలు చేయాల్సిన అవసరం ఉందని పీఏసీ కమిటీ ముందు సభ్యులు తెలిపారు

Also Read : దేశంలో అత్యంత శుభ్రమైన రైల్వే స్టేషన్లు ఇవే, టాప్ 10లో ఒకే తెలుగు స్టేషన్ కు చోటు!

కొంతమంది ఎంపీలు యూజర్ డెవలప్‌మెంట్ ఫీజులు (UDF), టిక్కెట్ ధరల్లో పరిమితి అంటూ లేకుండా పెంచడాన్ని తప్పుపట్టారు. ప్రస్తుతం ఉన్న విధానాలతో ప్రైవేట్ ఆపరేటర్లను జవాబుదారీగా చేయలేమన్న ఎంపీలు.. ఏరోనాటికల్, నాన్-ఏరోనాటికల్ టారిఫ్‌లు ఎలా నిర్ణయిస్తున్నారని చాలా మంది ఎంపీలు ప్రశ్నించారు. విమానాశ్రయాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఎయిర్పోర్టుల్లో అద్దెల ద్వారా వచ్చే ఆదాయంలో పారదర్శకత పాటించాలన్న ఎంపీలు.. ఆ ఆదాయాన్ని ప్రయాణీకుల ప్రయోజనాల కోసం వినియోగించాలన్నారు.

Related News

Air India Offer: బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్, ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

Lemon Crushing: కొత్త వెహికిల్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టే ఆచారం.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Coconut Price: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Bali vacation: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Big Stories

×