BigTV English

Thahaseeldar Demands Bribe in UPI: ఫోన్ పే లంచం.. అడ్డంగా బుక్ అయిన నంద్యాల తహసీల్దార్..

Thahaseeldar Demands Bribe in UPI: ఫోన్ పే లంచం.. అడ్డంగా బుక్ అయిన నంద్యాల తహసీల్దార్..

Anantharam District Nandhyal Thahaseeldar Demand Bribe in Phone Pay: లంచాల మీద ఎన్ని సినిమాలు వచ్చినా.. రోజుకు ఎంతమంది బుక్ అవుతున్నా ఇంకా ప్రభుత్వ అధికారులు మేలుకోవడం లేదు. ప్రభుత్వ ఇచ్చే జీతభత్యాల మీద ఎంత కాలం బతుకుతాం.. అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా చేసుకుంటున్నారు. మహా అయితే సస్సెండ్ అవుతాం.. అంతేకదా ఈ లోగా రిటైర్మెంట్ కు సరిపడా లంచాలు పోగుచేసుకుంటే సరి అనుకుంటున్నారు కొందరు.. మరికొందరు తమ తర్వాత తరాల వాళ్లు కూడా సంపద అనుభవించేలా సంపాదిస్తుంటారు. దొరికితే దొంగ.. దొరకనంత కాలం దొరలుగా చెలామణి అవుతున్నారు.


అయితే కొందరు లంచాలు తీసుకోవడంలో చాలా టెక్నిక్ లు ఉపయోగిస్తుంటారు. డైరెక్ట్ గా తాము ఇన్ వాల్వ్ అవ్వగుండా తమ కింద పనిచేసే అటెండర్లతో మధ్యవర్తిత్వం చేస్తుంటారు. మరికొందరు బహుమతుల రూపంలో ఇంటి వద్దే తీసుకుంటూ జాగ్రత్త పడుతుంటారు. అయితే ఏపీలో అనంతారం జిల్లా వజ్రకరూరుకు చెందిన తహసీల్దార్ కార్యాలయంలో అవినీతికి అలవాటు పడిన ఆ తహసీల్దార్ రూటే సెపరేటు. అందరిలా కాకుండా లంచాలు తీసుకోవడంలో ఆరితేరిన ఆ తహసీల్దార్ మహ్మద్ రఫీ ఈ సారి కర్రీలో కాలేశాడు.

రంగంలో దిగిన ఏసీబీ అధికారులు..


తన సమస్య తీర్చాలంటూ కొన్ని రోజులుగా ఓ రైతు ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. తన భూమి మ్యూటేషన్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న అతనికి సదరు తహసీల్దార్ మహ్మద్ రఫీ రూ.65 వేలు లంచం ఇస్తే అతని పని అయిపోతుందని మధ్యవర్తి ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే తన వద్ద అంత డబ్బు లేకపోవడంతో సదరు రైతు అవినీతి నిరోధక అధికారులను కలిసి తన గోడు విన్నవించుకున్నాడు. తహసీల్దార్ లంచం అడుగుతున్నాడని కంప్లైయంట్ చేశాడు. ఇంకేముంది ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.

Also Read: First Official Trip of Pawan: పవన్ తొలి అధికారిక పర్యటన, ఈనెల 19న ఢిల్లీకి

రైతుతో తహసీల్దార్ ఫోన్లో మాట్లాడిదానిని రికార్డు చేసుకున్నారు. పైగా ఆ రైతుతో తహసీల్దార్ అడిగిన లంచాన్ని ఫోన్ పే ద్వారా చెల్లించేలా చేశారు. ఇంకేముంది తహసీల్దార్ రఫీ అడ్డంగా బుక్ అయ్యాడు. వెంటనే రంగంలోకి దిగిన నంద్యాల శాఖ ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో సడెన్ గా దాడి చేశారు. ఈ దాడులలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహ్మద్ రఫీని అదుపులోకి తీసుకుని విచారించారు. లంచం తీసుకున్నట్లు నిరూపణ అవడంతో తహసీల్దార్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖను ఆదేశించారు.

Tags

Related News

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Nagpur Tragedy: దారుణం.. భార్య శవాన్ని బైకుకు కట్టుకుని వెళ్లిన భర్త.. ఎందుకంటే?

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Big Stories

×