BigTV English

Donald Trump as Republican Candidate: రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌.. ఉపాధ్యక్ష పదవికి ఆంధ్ర అల్లుడు..

Donald Trump as Republican Candidate: రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌.. ఉపాధ్యక్ష పదవికి ఆంధ్ర అల్లుడు..
Donald Trump as a Republican Candidate for America President Elections: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహియో సెనేటర్ జె.డి.వాన్స్ ఎంపికయ్యారు. మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులు పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరుకు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగానే ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహియో సెనేటర్ జె.డి.వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు.
అమెరికాలో నవంబరులో జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున కీలక నేత అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. అయితే ఎంతో ఆలోచించి అందరి యోగ్యతలను మదించిన తర్వాత ఉపాధ్యక్ష పదవికి వాన్స్ తగిన వ్యక్తి అని నిర్ణయించుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ లో వెల్లడించారు. కాగా, వాన్స్.. మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలు అందించారు.
ఒహాయో స్టేట్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడు కావడం విశేషం. ఆ తర్వాత యేట్ లా జర్నల్ కు సంపాదకుడిగా కూడా ఉన్నారు. ఆయన రచించిన ‘హిల్ బిల్లీ ఎలెజీ’ పుస్తకం అత్యధికంగా అమ్ముడుపోయింది. దీని ఆధారంగా సినిమా కూడా రూపొందించారు.
సాంకేతిక, ఆర్థిక రంగాల్లో విజయవంతమైన వ్యాపారవేత్త అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు. 39 ఏళ్ల వాన్స్ 2022లో అమెరిక3 సెనేట్‌కు ఎన్నికయ్యారు. మొదట్లో ట్రంప్ విధానాలను విమర్శించేవారు. తర్వాత ఆయనకు విధేయుడిగా మారారు. అయితే ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన వెంటనే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష్య, ఉపాధ్యక్ష అబ్యర్థులు ఖరారు కావడం గమనార్హం.
ఇదిలా ఉండగా, వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి. ఈమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు. అమెరికాలోని శాన్ డియాగోలో స్థిరపడ్డారు. 2014లో వాన్స్, ఉషలు వివాహం చేసుకున్నారు. కాగా, వీరిద్దరూ యేల్ లా స్కూల్‌లో కలిసి చదువుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. అయితే తన ఎదుగుదలలో ఉషా పాత్ర ఎనలేనిదని వాన్స్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


Related News

Greece Population: గ్రీస్ లో జనాభా సంక్షోభం.. పిల్లలు లేక స్కూల్స్ మూసివేత

SCO Summit 2025: మోడీ, జిన్‌పింగ్, పుతిన్ దెబ్బ.. భారత్ పై ట్రంప్ యూ టర్న్?

Sudan: సూడాన్‌లో ఘోరం.. ప్రకృతి బీభత్సం, 1000కి పైగా మృతి

Modi Putin BIG Meeting: నిన్న జిన్‌పింగ్, ఇవాళ పుతిన్‌తో.. మోదీ బిగ్ మీటింగ్స్..

Trump Tariffs: కత్తులు నూరుతూ.. భారత్ పై ట్రంప్ లాస్ట్ అస్త్రం ఇదేనా!

Afghanistan Earthquake: ఆఫ్థాన్‌లో వరుస భూకంపాలు, మృతులు 250 మందికి పైగానే?

Big Stories

×