BigTV English

CM Chandrababu Delhi Tour: ఏపీ కేబినెట్ భేటీ.. ఆ తర్వాత ఢిల్లీకి చంద్రబాబు.. ఎందుకు..?

CM Chandrababu Delhi Tour: ఏపీ కేబినెట్ భేటీ.. ఆ తర్వాత ఢిల్లీకి చంద్రబాబు.. ఎందుకు..?

CM Chandrababu Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ టూర్‌‌లో  భాగంగా తొలుత అమిత్ షాను కలిసిన తర్వాతే ప్రధాని నరేంద్రమోదీని కలవనున్నారు. విభజన అంశాలతోపాటు రాజకీయాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


చంద్రబాబు కేబినెట్ మంగళవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఎన్నికల హామీలు, ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గం చర్చించనుంది. ముఖ్యంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఇవేకాకుండా మిగతా శాఖల గురించి వచ్చిన డీటేల్స్‌పై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అంతా అనుకున్నట్లు జరిగితే ఈనెల 22న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ తర్వాత బడ్జెట్ సమావేశాలపై క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.  ఇదిలావుండగా మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. విభజన సమస్యలపై
కేంద్రంలో చర్చించనున్నారు.


Also Read: కోడికత్తి కేసు.. శ్రీనివాసరావు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ

తొలుత హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో ఆర్థిక పరిస్థితి గురించి వివరించి విభజన సమస్యలపై ఆయనతో మాట్లాడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇటీవల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. చాలావరకు నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమయంలో కేంద్ర హోంశాఖ ఇన్వాల్వ్ అయితే ఆయా సమస్యలకు ఫుల్‌స్టాప్ పడుతుందని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

మరోవైపు ఈనెల 23న కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఆర్థికంగా ఏమైనా సాయం చేయాలని కోరనున్నారు. అమిత్ షా భేటీ తర్వాత వీలైతే ప్రధాని నరేంద్రమోదీతో కూడా సీఎం చంద్రబాబు సమావేశం అవుతారని అంటున్నారు. పనిలోపనిగా ఏపీలో రాజకీయ అంశాలపై చర్చించ నున్నారు.

Tags

Related News

Why Not Pulivendula: వైనాట్ కుప్పం.. వైనాట్ పులివెందుల

RTC mike announcement: మహిళలకు ఫ్రీ బస్.. మైక్ అనౌన్స్‌మెంట్స్ కండక్టర్ కొత్త కల్చర్!

Nara Lokesh: అలాంటి సినిమాలను రిలీజ్ కానివ్వం -లోకేష్ ఘాటు హెచ్చరిక

Ysrcp Silence: స్త్రీశక్తిపై వైసీపీ మౌనం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒప్పుకున్నట్టేనా?

AP Free Bus: ఏపీలో ఫ్రీ బస్.. బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, పవన్.. వారితో మహిళల మాట ఇదే!

AP weather alert: తీరప్రాంతంలో టెన్షన్ టెన్షన్.. 24 గంటల్లో అక్కడ దంచుడే!

Big Stories

×