BigTV English
Advertisement

America: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు

America: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు

America: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని యార్క్ కౌంటీ, నార్త్ కొడోరస్ టౌన్‌షిప్‌లో జరిగిన కాల్పుల కలకలం రేపుతుంది. అయితే ఈ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడు కూడా పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ఈ ఘటన గృహ హింసకు సంబంధించిన వారెంట్ సర్వ్ చేయడానికి పోలీసులు వెళ్లిన సమయంలో జరిగిందని చెబుతున్నారు.


సెప్టెంబర్ 17న మధ్యాహ్నం 2:10 గంటలకు మొదటి 911 కాల్ వచ్చింది. నార్దర్న్ యార్క్ రీజినల్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారులు, యార్క్ కౌంటీ షెరిఫ్ ఆఫీస్ డిప్యూటీలు హార్ రోడ్, ఎమిగ్ రోడ్ ప్రాంతంలోని ఒక నివాసానికి వెళ్లారు. ఇది స్టాకింగ్, క్రిమినల్ ట్రెస్‌పాస్‌కు సంబంధించిన వారెంట్ సర్వ్ చేయడానికి. ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే దుండగుడు అధికారులపై కాల్పులు జరిపాడు. సుమారు 30 షాట్లు జరిగినట్లు సాక్షులు చెప్పారు. ఇది అరగంట పాటు కొనసాగింది.

నార్దర్న్ యార్క్ రీజినల్ పోలీస్‌కు చెందిన ముగ్గురు అధికారులు అక్కడికక్కడే మరణించారు. మరో అధికారి తీవ్ర స్థితిలో ఉన్నాడు. యార్క్ షెరిఫ్ డిప్యూటీ ఒకరు గాయపడ్డారు, అయితే అది గన్‌షాట్ కాని గాయం కావచ్చంటున్నారు. గాయపడిన ఇద్దరు అధికారులు ప్రస్తుతం వెల్‌స్పాన్ యార్క్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.. కానీ, వారి విషమంగా ఉందని చెబుతున్నారు. దుండగుడు కూడా పోలీసుల కాల్పుల్లో హతమైనట్లు అధికారులు చెప్పారు.


పెన్సిల్వేనియా స్టేట్ పోలీస్ కమిషనర్ కల్నల్ క్రిస్టోఫర్ పారిస్ ఘటనను ధృవీకరించారు. ఇది టెర్రరిజం కాదని, గృహ హింసకు సంబంధించినదని చెప్పారు. గవర్నర్ జాష్ షాపిరో ఘటనాస్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. “మన దేశం, కౌంటీ కోసం పనిచేసిన అత్యంత విలువైన అధికారులను కోల్పోయాము. ఇలాంటి హింసాత్మక చర్యలు సహించలేము. మెరుగైన సమాజం కోసం కలిసి పనిచేద్దాం” అని ప్రజలకు పిలుపునిచ్చారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆస్టిన్ డేవిస్ Xలో పోస్ట్ చేసి, అధికారుల కోసం ప్రార్థనలు చేయమని కోరారు.

స్ప్రింగ్ గ్రోవ్ ఏరియా స్కూల్ డిస్ట్రిక్ట్ షెల్టర్-ఇన్-ప్లేస్ ఆర్డర్ జారీ చేసింది, కానీ 4:10 PMకి లిఫ్ట్ చేశారు. స్కూళ్లు ఘటనకు సంబంధం లేదని, విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. లైఫ్ లయన్ హెలికాప్టర్లు గాయపడినవారిని హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్ లాక్‌డౌన్‌లో ఉంచారు. సమాజం దిగ్భ్రాంతికి గురైంది. యువాల్డే ఫౌండేషన్ ఫర్ కిడ్స్ ట్రామా సపోర్ట్ అందిస్తోంది. రాష్ట్ర ఫ్లాగ్‌లు హాఫ్-స్టాఫ్‌లో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.పెన్సిల్వేనియా స్టేట్ పోలీస్, FBI, ATF ఏజెన్సీలు దర్యాప్తు చేపట్టాయి. బాలిస్టిక్స్, మోటివ్‌లను పరిశీలిస్తున్నాయి. దుండగుడు గురించి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు..

Also Read: స్కూడ్రైవర్ మింగేసిన 8 ఏళ్ల బాలుడు.. సర్జరీ చేసి వెలికితీసిన వైద్యులు.

ఇటీవలి కాలంలో అమెరికాలో పోలీసు అధికారులపై దాడులు పెరుగుతున్నాయి, ఇది ఆందోళన కలిగిస్తోంది. గవర్నర్ షాపిరో ఇలాంటి హింసను ఖండించారు, సమాజంలో మార్పు కోసం పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలకు సహాయం అందిస్తామని ప్రకటించారు. ఈ ఘటన రూరల్ ప్రాంతంలో జరగడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్ప్రింగ్ గ్రోవ్ పట్టణం, దాదాపు 2,500 మంది జనాభా ఉన్న చిన్న ప్రదేశం, పెద్ద పేపర్ ప్లాంట్‌కు ప్రసిద్ధి అని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ఇవకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Bus Accident: మరో బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి, 40 మందికి గాయాలు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయలు

Constable suicide: రాష్ట్రంలో దారుణ ఘటన.. గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ సూసైడ్, ఎందుకంటే?

Chevella Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ప్రమాదం ఎలా జరిగింది..? బాధితులు ఏమంటున్నారంటే?

Road Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే 10 మంది మృతి

Road Accident: అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన వంగలపూడి అనిత

Road Accident: ఘోర ప్రమాదం.. ఇంట్లోకి దూసుకెళ్లిన గ్రానైట్ లారీ.. స్పాట్ లోనే మహిళ

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ-ఆర్టీసీ ఢీ.. స్పాట్‌లో 19 మంది మృతి

Big Stories

×