E-Paper
Advertisement

అస్సాంలో ఘోర ప్రమాదం.. జోర్హాట్ ఐఏఎఫ్ బేస్‌లో కుప్పకూలిన కార్గో విమానం!

అస్సాంలో ఘోర  ప్రమాదం.. జోర్హాట్ ఐఏఎఫ్ బేస్‌లో కుప్పకూలిన కార్గో విమానం!
Advertisement

Plane Crash: అస్సాంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జోర్హాట్‌లోని భారత వైమానిక స్థావరంలో గురువారం ఒక సైనిక రవాణా విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. భారత సైన్యానికి రక్షణ సామాగ్రి, నిత్యావసరాలను చేరవేసేందుకు ఉపయోగించే ఏఎన్-32 (AN-32) కార్గో విమానంగా దీనిని గుర్తించారు. సాంకేతిక లోపమా లేక వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు IAF సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు . సమాచారం అందుకున్న వెంటనే వైమానిక దళానికి చెందిన ప్రత్యేక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. విమాన శకలాల నుంచి పైలట్‌ను వెలికితీసే ప్రయత్నాలు సాగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం సేవలందించే ఇలాంటి కార్గో విమానం ప్రమాదానికి గురికావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: అందినకాడికి దోచేసి.. ఇప్పుడు నీతులు చెప్తారా? హరీష్ రావుపై ఎమ్మెల్యే గండ్ర ఫైర్!

Related News

వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన.. బంగాళాఖాతంలో ద్రోణి, ఏపీలో భారీ వర్షాలు

చైన్ స్నాచర్ల ఆటకట్టించిన రియల్ హీరో.. వృద్ధ దంపతులను కాపాడిన దృశ్యాలు వైరల్!

32 ఏళ్ల క్రితం పుట్టింటికి వెళ్లి.. తిరిగి రాని భార్య.. 67 ఏళ్ల వయసులో భర్తకు విడాకులు!

సుశాంత్ రాజ్ పుత్ మేనేజర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆదిత్య థాక్రే, రియా చక్రవర్తిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్!

నవ వధువు దారుణ హత్య.. భార్య తల నరికి ఫ్రిజ్‌లో దాచిన హంతకుడు

సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. వేడెక్కిన కర్ణాటక రాజకీయాలు, పార్టీల్లో చర్చ

కుక్క పెట్టిన చిచ్చు.. లిఫ్ట్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్!

రియా హత్య కేసులో.. అసలు విషయాలు తేలకుండానే, భార్యని చంపి ఫ్రిడ్జ్‌లో పెట్టి

Big Stories

Advertisement
×