E-Paper
Advertisement

వామ్మో దొంగలంటే వీళ్లే రా బాబోయ్.. ఒకే రాత్రి 4 ఇళ్లు ఊడ్చేసి ఎలా పారిపోయారంటే?

వామ్మో దొంగలంటే వీళ్లే రా బాబోయ్.. ఒకే రాత్రి 4 ఇళ్లు ఊడ్చేసి ఎలా పారిపోయారంటే?
Advertisement

Tirupati Theft: వామ్మో ఇలాంటి దొంగలు నెవ్వర్‌ బిఫోర్. ఎవ్వర్ ఆఫ్టర్. వీళ్లు దొంగతనంలో పీచ్‌హెడీ చేసినట్లు ఉన్నారు. వాళ్ల టైమింగ్‌కి వాళ్ల ప్లానింగ్‌కి టేకబౌ. ఆ దొంగలు దండుకట్టి దండయాత్రకే వచ్చినట్టు వచ్చారు.

ఒకే రాత్రి 4 ఇళ్లు కొల్లగొట్టి..

Advertisement

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ముంగిళిపట్టు గ్రామం. రాత్రి వేళ అందరూ డీప్‌స్లీప్‌లో ఉన్నారు. సరిగ్గా అదే టైమ్‌లో దొంగల అడుగులు ఆ ఊళ్లో పడ్డాయి. ముందు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ చేతికి చిక్కినవవన్నీ ఊడ్చేశారు. బయటకు వచ్చి ఊరిదాటి పారిపోలేదు. మరో ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ టార్గెట్ ఫినిష్ అవ్వగానే రెస్ట్ తీసుకోలేదు. మరో ఇంట్లోకి వెళ్లి 40వేలు పట్టుకొచ్చారు. ఆ తర్వాత ఇంకో హౌస్.. ఇలా వరుసగా ఒకే రాత్రి నాలుగు ఇళ్లల్లోకి ఎంట్రీ సక్సెస్‌ఫుల్‌గా చోరీ చేసుకొని వచ్చేశారు.

పక్కా ప్లాన్‌తో ట్రైన్ ఆపి మరీ

Advertisement

నాలుగు ఇళ్లల్లో కామ్‌ కామ్‌గా ఫినిష్ చేశారు. అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయలేదు. వాళ్ల నెక్స్ట్ ప్లాన్ మామూలుగా లేదు. దొంగతనం చేసిన తర్వాత పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఏం చేశారో తెలుసా? రైల్వే గ్రీన్ సిగ్నల్ లైట్‌ కనెక్షన్‌నే కట్ చేశారు. అంతే.. సిగ్నల్ కనిపించక ఆ రూట్‌లో వస్తున్న రైలు మధ్యలోనే ఆగిపోయింది. అదే ట్రైన్‌లో ఎక్కేసి ఖాళీగా సీట్లో కూర్చున్నారు.

ఏంట్రా ఈ మాస్టర్ ప్లాన్..

అసలు దొంగతనం ఒక ఎత్తు.. రైలును ఆపించి అదే రైలులో ఎస్కేప్ అవ్వాలన్న ఐడియా మరో ఎత్తు. ఏంట్రా ఈ మాస్టర్ ప్లాన్ అనిపించేలా చేశారు. కానీ ఆ ట్రైన్‌లో వాళ్ల దురాశకు మరో బలి దొరికింది. రైలు ఎక్కిన తర్వాత కూడా వాళ్ల ఆశ చావలేదు. ఓ బోగీలో ప్రయాణిస్తున్న మహిళ నిద్రపోతున్న టైమ్ చూసి.. ఆమె మెడలో ఉన్న 10 గ్రాముల బంగారు గొలుసును లాగేశారు. అంతే.. చైన్‌తో అక్కడి నుంచి మాయమయ్యారు.

రైలులో మరో చోరీ..

కాట్పాడి సమీపంలో నిద్రలేచిన మహిళ.. ఖాళీ మెడ చూసుకుని ఆగఆగమైంది. వెంటనే రైల్వే పోలీసులకు గొలుసు పోయిందని కంప్లైంట్ చేసింది. ఒక ఊళ్లో నాలుగు ఇండ్లు కొల్లగొట్టి.. రైల్వేలైన్ సిగ్నల్‌తో ఆటలాడి.. రైలులో మరో చోరీకి పాల్పడ్డారంటే వీళ్లు మాములు దొంగలు కాదు. ఒకే రాత్రి ఈ రేంజ్ పర్ఫామెన్స్ ఇచ్చారంటే వాళ్లకు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉందో అర్థమవుతుంది. పోలీసులు ఇప్పుడు వాళ్లను పట్టుకునేందుకు సెర్చింగ్ మొదలుపెట్టారు. వాళ్లు చిక్కుతారో లేదో చూడాలి.

Also Read: ఆర్గానిక్ అంత్యక్రియలు.. చనిపోయిన తర్వాత డెడ్ బాడీని ఏం చేస్తారంటే..

Tags

Related News

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం షాపులు మూసివేత.. 3 రోజులు చుక్క లేనట్లే!

ఎమ్మెల్యే రేంజ్ ఆస్తులు.. జెడ్పీటీసీగా పోటీ! ఎవరీ మమతశ్రీ?

చంద్రబాబుకి పబ్లిక్ స్టంట్లు తప్ప వరద బాధితులపై పట్టింపు లేదు: బొత్స సత్యనారాయణ

గుంటూరు మేయర్‌ అభ్యర్థి, నా చెల్లిని గెలిపించాలని ఓటర్లకు నటుడు జగపతిబాబు విజ్ఞప్తి

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. ఆటోను ఢీకొట్టిన గ్యాస్ లారీ.. ఇద్దరు దుర్మరణం!

‘ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాల్సిందే’.. ఏపీ ప్రభుత్వానికి షర్మిల అల్టిమేటం!

గ్యాస్ వినియోగదారులకు రిలీఫ్.. సిలిండర్ల డెలివరీకి OTP నుంచి మినహాయింపు

Big Stories

Advertisement
×