E-Paper
Advertisement

నటుడు కావాలనే కల.. కుటుంబ ఒత్తిడితో చదువు.. చివరకు 19వ అంతస్తు నుంచి దూకి..!

నటుడు కావాలనే కల.. కుటుంబ ఒత్తిడితో చదువు.. చివరకు 19వ అంతస్తు నుంచి దూకి..!
Advertisement

Student Suicide: ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఇష్టం లేని చదువు చదువుతున్న ఓ యువకుడు.. తీవ్ర మనస్థాపంతో ప్రాణాలు తీసుకున్నాడు. బిల్డింగ్ 19వ అంతస్తు నుంచి దూకి బీబీఏ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నటుడిగా మారేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం వల్లే విద్యార్థు సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

గ్రేటర్ నోయిడాలోని ‘ప్రిస్టైన్ అవెన్యూ సొసైటీ’లో గురువారం తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. టవర్-A లో తన కుటుంబంతో కలిసి నివాసముంటున్న 18 ఏళ్ల విద్యార్థి.. ఎవరికీ చెప్పకుండా తెల్లవారుజామునే ఇంట్లోంచి బయటకు వచ్చాడు. పక్కనే ఉన్న టవర్-B లోకి వెళ్లి.. 19వ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

Advertisement

పోలీసుల విచారణ ప్రకారం.. సదరు విద్యార్థి ఘజియాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతనికి నటనపై ఎంతో ఆసక్తి ఉండేదని ఎలాగైనా మంచి నటుడు కావాలని కలలు కనేవాడని తెలిసింది. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగానే అతను ఇష్టం లేకున్నా బీబీఏ కోర్సులో చేరినట్లు సమాచారం.

అయితే గత కొన్ని రోజులుగా యువకుడు దేనికో తీవ్రంగా బాధపడుతున్నాడని ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా ఉండేవాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కాగా, ఆత్మహత్యకు ఖచ్చితమైన కారణం చదువుల ఒత్తిడా లేక వేరే ఏదైనా ఉందా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఘటనకు ముందు ఇంట్లో ఎలాంటి గొడవలు కానీ, తల్లిదండ్రులు మందలించిన దాఖలాలు కానీ లేవని పోలీసుల విచారణలో తేలింది.

Advertisement

Also Read: లగ్జరీ ఫ్లాట్‌ అద్దెకిచ్చే అందమైన అమ్మాయి… కలల ఇల్లు కాస్తా భయంకరమైన పీడకలగా మారితే… తమిళ హర్రర్ మూవీ తెలుగులో

మరోవైపు ఘటనా స్థలంలో గానీ, విద్యార్థి ఇంట్లో గానీ ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని ఇన్ స్పెక్టర్ రంజీత్ సింగ్ వెల్లడించారు. మృతుడికి తల్లిదండ్రులు, ఒక తమ్ముడు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో లోతుగా విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: స్క్రాప్ బిజినెస్ ఎలా ప్రారంభించాలి? ఎక్కడ కొనాలి, ఎవరికి అమ్మాలి? చెత్త నుంచి సూపర్ సంపాదన

Tags

Related News

భర్త సంపాదన నెలకు రూ.3 లక్షలు, రూ.1.7కోట్ల హోమ్ లోన్.. భార్యకు ప్రతినెలా రూ.2 లక్షలు చెల్లించాలన్న కోర్టు

22 సెకన్లలో 5 రౌండ్ల కాల్పులు.. నిందితుడు ఫైర్ చేస్తూ అరుపులు. ముగ్గురు మృతి, లక్నోలో షాకింగ్ ఘటన

ఆ బస్సులో బ్రేకులు ఫెయిల్.. బస్సు నుంచి దూకేసిన ప్రయాణికులు, షాకింగ్ వీడియో

భూటాన్‌లో బద్దలైన హిమానీనద సరస్సు.. అస్సాం- బెంగాల్‌కు బిగ్ అలర్ట్, సురక్షిత ప్రాంతాలకు ప్రజలు

రూ.5 చిప్స్ ప్యాకెట్‌ కొంటే మోసం.. లేస్ కంపెనీకి రూ.8,000 జరిమానా విధించిన కోర్టు

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కీలక పరిణామం.. 14 మంది నిందితులపై కోర్టు సంచలన తీర్పు!

రూ.200 లాటరీ టిక్కెట్‌తో లగ్జరీ కారు.. బాలుడిని వరించిన రూ.50 లక్షల ఫార్చ్యూనర్!

Big Stories

Advertisement
×