E-Paper
Advertisement

భర్త సంపాదన నెలకు రూ.3 లక్షలు, రూ.1.7కోట్ల హోమ్ లోన్.. భార్యకు ప్రతినెలా రూ.2 లక్షలు చెల్లించాలన్న కోర్టు

భర్త సంపాదన నెలకు రూ.3 లక్షలు, రూ.1.7కోట్ల హోమ్ లోన్.. భార్యకు ప్రతినెలా రూ.2 లక్షలు చెల్లించాలన్న కోర్టు
Advertisement

Wife maintenance rights| భారీ హోమ్ లోన్ ఉంది.. జీతం సగానికి పడిపోయింది.. తల్లిదండ్రుల బాధ్యతలు కూడా తనపైనే ఉన్నాయని విడాకులు తీసుకున్న భార్యకు భారీ భరణం చెల్లించలేనని ఓ వ్యక్తి కోర్టుకు విన్నవించుకున్నాడు. అయితే, అతడి వాదనలను ఫ్యామిలీ కోర్టు పూర్తిగా అంగీకరించలేదు. భార్య, పిల్లల పోషణ బాధ్యతల నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. నెలకు రూ.2 లక్షల భరణం చెల్లించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.

భార్యకు ప్రతి నెలా రూ.2 లక్షల భరణం చెల్లించాలి

గురుగ్రామ్ కుటుంబ న్యాయస్థానం ఓ భర్తకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విడిపోయి ఉంటున్న భార్య, పిల్లల పోషణ కోసం నెలకు రూ.2 లక్షలు చెల్లించాలని స్పష్టం చేసింది. ప్రతి నెలా 10వ తేదీలోపు ఈ మొత్తాన్ని చెల్లించాలి. అంతేకాకుండా, న్యాయపరమైన ఖర్చుల కోసం మరో రూ.50,000 చెల్లించాలని ఆదేశించింది.
భర్త తన వార్షిక ఆదాయం భారీగా తగ్గిందని కోర్టులో వాదించాడు. ప్రస్తుతం తన నికర వార్షిక జీతం సుమారు రూ.36 లక్షలేనని తెలిపాడు. తనపై రూ.1.7 కోట్ల హోమ్ లోన్ భారం ఉందని పేర్కొన్నాడు. తల్లిదండ్రుల బాధ్యతలు కూడా తానే చూసుకోవాల్సి వస్తోందని వివరించాడు. అయితే, అతడి గత ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న కోర్టు భరణం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

2005లో వివాహం

Advertisement

ఈ దంపతులకు 2005 జూలై 12న లక్నోలో వివాహమైంది. వీరికి కవల పిల్లలు ఉన్నారు. భర్త ప్రముఖ ఐటీ కంపెనీ డెలాయిట్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. భార్య తనకు, పిల్లలకు కలిపి నెలకు రూ.4 లక్షల భరణం చెల్లించాలని కోర్టును ఆశ్రయించింది. అలాగే, న్యాయపరమైన ఖర్చుల కోసం రూ.7.5 లక్షలు కోరింది. అయితే, తన ఆదాయం తగ్గిందని భార్య డిమాండ్‌ను భర్త వ్యతిరేకించాడు. పిల్లల బోర్డింగ్ స్కూల్ ఫీజుల కోసం ఏడాదికి రూ.19.2 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపాడు.

ఆదాయం తగ్గిందన్న వాదనను కోర్టు ఎందుకు నమ్మలేదు?

భర్త సమర్పించిన ఆదాయపు పన్ను రిటర్నుల్లో ఆదాయానికి సంబంధించిన వివరాలు కనిపించాయి. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరంలో అతడి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం సుమారు రూ.2 కోట్లు. 2024-25లో ఇది రూ.2.9 కోట్లకు చేరింది. అయితే, 2025-26లో సుమారు రూ.1 కోటి తగ్గింది. అయినప్పటికీ, అదే సీనియర్ ఉద్యోగంలో కొనసాగుతున్న భర్త ఆదాయం తగ్గడానికి సరైన కారణాలు చూపలేకపోయాడని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల అతడి గత సంపాదన సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించడం మాత్రమే వారి బాధ్యతలను పూర్తి చేయదని కోర్టు పేర్కొంది. రోజువారీ అవసరాలకు కూడా ఖర్చులు ఉంటాయని స్పష్టం చేసింది.

Advertisement

Also Read: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్యకు కేవలం రూ.500 జరిమానా.. హైకోర్టు షాకింగ్ తీర్పు

భార్య చదువుకున్న మహిళ అయితే భరణం ఇవ్వరా?

భార్య ఉన్నత విద్యావంతురాలని, ఉద్యోగం చేసి సంపాదించగలదని భర్త తరఫు న్యాయవాది వాదించారు. ఆమె పీపీఎఫ్ ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వివరాలు వెల్లడించలేదని ఆరోపించారు. జార్జియా పర్యటనతో పాటు విదేశీ ప్రయాణాలను కూడా ప్రస్తావించారు. అయితే, చదువుకున్నంత మాత్రాన మహిళకు ఆదాయం ఉన్నట్లు భావించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగం చేస్తున్నట్లు లేదా స్వతంత్ర ఆదాయం ఉన్నట్లు నిరూపించాలి. ఆస్తులు, విదేశీ ప్రయాణాలపై వచ్చిన ఆరోపణలకు కూడా సరైన ఆధారాలు అవసరమని పేర్కొంది.

Also Read: డాక్టర్ భార్యకు భరణం ఎందుకు? విడాకుల కేసులో మండిపడిన హైకోర్టు

కోర్టు తుది ఆదేశాలు

భార్య, పిల్లలకు కలిపి నెలకు రూ.2 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ప్రతి నెలా 10వ తేదీలోపు ఈ చెల్లింపు జరగాలి. న్యాయపరమైన ఖర్చుల కోసం రూ.50,000 ఇవ్వాలి. పిల్లల విద్యా ఖర్చులను కూడా భర్త పూర్తిగా భరించాలి. ఆదాయం తగ్గిందనే కారణంతో భరణం బాధ్యత నుంచి తప్పించుకోలేరని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.

Related News

నటుడు కావాలనే కల.. కుటుంబ ఒత్తిడితో చదువు.. చివరకు 19వ అంతస్తు నుంచి దూకి..!

22 సెకన్లలో 5 రౌండ్ల కాల్పులు.. నిందితుడు ఫైర్ చేస్తూ అరుపులు. ముగ్గురు మృతి, లక్నోలో షాకింగ్ ఘటన

ఆ బస్సులో బ్రేకులు ఫెయిల్.. బస్సు నుంచి దూకేసిన ప్రయాణికులు, షాకింగ్ వీడియో

భూటాన్‌లో బద్దలైన హిమానీనద సరస్సు.. అస్సాం- బెంగాల్‌కు బిగ్ అలర్ట్, సురక్షిత ప్రాంతాలకు ప్రజలు

రూ.5 చిప్స్ ప్యాకెట్‌ కొంటే మోసం.. లేస్ కంపెనీకి రూ.8,000 జరిమానా విధించిన కోర్టు

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కీలక పరిణామం.. 14 మంది నిందితులపై కోర్టు సంచలన తీర్పు!

రూ.200 లాటరీ టిక్కెట్‌తో లగ్జరీ కారు.. బాలుడిని వరించిన రూ.50 లక్షల ఫార్చ్యూనర్!

Big Stories

Advertisement
×