AP Liquor Ban: ఏపీలో మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థలను దృష్టిలో ఉంచుకొని మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. మెుత్తం మూడు రోజుల పాటు.. లిక్కర్ అమ్మకాలపై ఆంక్షలు విదించారు. తొలి విడతగా ఇవాళ (అక్టోబర్ 30) సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ సాయంత్రం 5 గంటల వరకూ 48 గంటల పాటు వైన్ షాపులు మూత పడనున్నాయి. అదే విధంగా నవంబర్ 3 ఓటర్ లెక్కింపు సందర్భంగానూ మరోమారు వైన్ షాపులు బంద్ కానున్నాయి.
రాష్ట్రంలో ఎన్నికలు జరిగే 13 మున్సిపల్ కార్పోరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ మద్య నిషేదం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. కాగా, మున్సిపల్ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపును.. ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Also Read: దీపావళి సీజన్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు.. ఈ 5 కార్లపై లక్షల్లో తగ్గింపు!
నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయించినా, సరిహద్దుల నుంచి మద్యం అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు హెచ్చరించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, పోలీసు యంత్రాంగం నిరంతరం తనిఖీలు చేపడతాయని స్పష్టం చేశారు. ఎవరైనా మద్యం అమ్ముతూ పట్టుబడితే వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామన్ని తెలియజేశారు.
Also Read: ఉత్తరాఖండ్‌లో తీవ్ర విషాదం.. బద్రీనాథ్ మార్గంలో కూలిన హెలికాప్టర్.. పైలెట్ సహా ఆరుగురు మృతి