Panipat News: హర్యానా రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పానిపట్‌లో జరిగిన ఒక దారుణ ఘటనలో 35 ఏళ్ల మహిళ ఖాళీ రైలు కోచ్‌లో సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన జూన్ 24న పానీపట్ రైల్వే స్టేషన్‌లోని క్విల్లా ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బాధితురాలు తన భర్తతో గొడవ పడి జూన్ 24 నుంచి కనిపించకుండా పోయింది. ఆమె భర్త జూన్ 26న పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఆమె గతంలో కూడా ఇలా ఇంటి నుంచి వెళ్లి తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయని అతను పోలీసులకు వివరించాడు. అయితే, ఈసారి ఆమె బయటకు వెళ్లిన తర్వాత దారుణ ఘటనను ఎదురుచూసింది.
బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇంట్లో భర్తతో గొడవపడి బయటకు వచ్చిన తర్వాత.. ఆమె రైల్వే స్టేషన్‌లో కూర్చొంది. అదే సమయంలో ఒక వ్యక్తి తన భర్త పంపాడని చెప్పి ఆమెను సంప్రదించాడు. ఆ వ్యక్తి ఆమెను ఒక ఖాళీ రైలు కోచ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మరో ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడికి చేరుకొని ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం తర్వాత, నిందితులు ఆమెను సోనీపట్‌కు తీసుకెళ్లి రైల్వే ట్రాక్‌పై పడేశారు. దురదృష్టవశాత్తూ, ఆ సమయంలో ఒక రైలు ఆమెపై నుంచి వెళ్లడంతో ఆమె కాలు తెగిపోయింది.
ALSO READ: NAL Recruitment: సువర్ణవకాశం.. రూ.63వేల జీతంతో ఉద్యోగాలు, టెన్త్ పాసైతే చాలు
ఈ ఘటన జూన్ 25 రాత్రి సోనీపట్‌లోని హిందూ కాలేజీ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆమె కనిపించినప్పుడు వెలుగులోకి వచ్చింది. సోనీపట్ రైల్వే పోలీసులు వెంటనే ఆమెను సమీపంలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ఆమెను రోహ్‌తక్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. జూన్ 4న ఆమె ఒక మహిళా డాక్టర్‌కు తనకు జరిగిన దుర్ఘతిని వివరించడంతో ఈ దారుణ సంఘటన బయటపడింది. వైద్య పరీక్షలు అనంతరం కూడా బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు తెలిపారు.
ALSO READ: DSSSB Recruitment: పది, ఇంటర్ అర్హతతో 2119 ఉద్యోగాలు, అప్లై చేస్తే నౌకరి, ఇంకెందుకు ఆలస్యం
క్విల్లా పోలీసు స్టేషన్ ఆఫీసర్ శ్రీ నివాస్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై జీరో FIR నమోదు చేసి, పానీపట్ గవర్నమెంట్ రైల్వే పోలీసులకు బదిలీ చేసినట్లు తెలిపారు. రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ ఆదేశాల మేరకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన హర్యానాలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళనలను లేవనెత్తింది. నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.